తెలంగాణ

telangana

ETV Bharat / sports

టాస్ గెలిచిన టీమిండియా.. వెస్టిండీస్​ బ్యాటింగ్ - india vs west indies first odi

వెస్టిండీస్​తో జరుగుతోన్న తొలి వన్డేలో టాస్ గెలిచిన కోహ్లీసేన బౌలింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా మ్యాచ్​ కాస్త ఆలస్యంగా ప్రారంభమయింది.

మ్యాచ్

By

Published : Aug 8, 2019, 8:44 PM IST

గయానా వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో టాస్​ గెలిచిన కోహ్లీసేన బౌలింగ్​ ఎంచుకుంది. వర్షం అంతరాయం కలిగించడం వల్ల 7 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్​ ఆలస్యమైంది. టీట్వంటీ సిరీస్​ను 3-0తో గెలిచిన ఉత్సాహంలో ఉన్న టీమిండియా.. అదే ఊపును కొనసాగించాలని చూస్తోంది.

వెస్టిండీస్​ తరఫున చివరి సిరీస్​ ఆడనున్నాడు విధ్వంసక క్రికెటర్ క్రిస్ గేల్. మరి ఈ మ్యాచ్​లో తనపై ఉన్న అంచనాలని ఎంతమేర నిలబెట్టుకుంటాడో చూడాలి. మరో 11 పరుగులు చేస్తే వన్డేల్లో విండీస్​ తరఫున అత్యధిక పరుగుల జాబితాలో తొలి స్థానం సంపాదిస్తాడు.

జట్లు

వెస్టిండీస్

క్రిస్ గేల్, షై హోప్, ఎవిన్ లూయిస్, హెట్మయిర్, నికోలస్ పూరన్, హోల్డర్(కెప్టెన్), రోస్టన్ ఛేజ్, ఫాబియాన్ అలెన్, బ్రాత్​వైట్, కాట్రెల్, కీమర్ రోచ్

టీమిండియా

శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ(కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, కుల్​దీప్ యాదవ్, మహ్మద్ షమీ, ఖలీల్ అహ్మద్

ABOUT THE AUTHOR

...view details