తెలంగాణ

telangana

ETV Bharat / sports

సరదాగా కోహ్లీసేన.. ఫొటోలు వైరల్ - india vs west indies news

భారత్​-వెస్టిండీస్​ మధ్య నిర్ణయాత్మక ఆఖరి వన్డే ఆదివారం జరగనుంది.  ప్రస్తుతం మూడు వన్డేల సిరీస్​లో 1-1 తేడాతో సమంగా ఉన్నాయి ఇరుజట్లు. ఇప్పటికే ఒడిశాలోని కటక్​ చేరుకున్న టీమిండియా.. ప్రాక్టీస్​ లేకపోవడం వల్ల సరదాగా గడుపుతూ కనిపించింది.

India vs West Indies 2019
ప్రాక్టీస్​ లేకపోవడం వల్ల బిందాస్​గా కోహ్లీ సేన

By

Published : Dec 20, 2019, 8:09 PM IST

వెస్టిండీస్‌-భారత్​ జట్ల మధ్య కీలక మూడో వన్డే.. కటక్‌ వేదికగా ఆదివారం జరగనుంది. అయితే ఈ మ్యాచ్​కు ముందు టీమిండియాకు మూడు రోజులు విశ్రాంతి దొరికింది. శుక్రవారం ఇరుజట్లకు ప్రాక్టీస్‌ సెషన్‌ లేకపోవడం వల్ల కోహ్లీ తన సహచరులతో కలిసి సరదాగా గడిపాడు. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోలను తన ట్విట్టర్​లో షేర్‌ చేశాడు. ఇందులో విరాట్​తో పాటు కేఎల్‌ రాహుల్‌, రిషబ్‌ పంత్‌, రవీంద్ర జడేజా, కేదార్‌ జాదవ్‌, యజువేంద్ర చాహల్‌, శ్రేయస్​ అయ్యర్​, మనీశ్​ పాండే ఉన్నారు.

కోహ్లీతో మిగతా ఆటగాళ్లు

సిరీస్​ సమం...

చెన్నై వేదికగా భారత్​తో జరిగిన మొదటి వన్డేలో 8 వికెట్ల తేడాతో గెలిచింది వెస్టిండీస్​. ఆ తర్వాత విశాఖలో జరిగిన రెండో వన్డేలో రోహిత్‌, రాహుల్‌ శతకాలతో ఆకట్టుకోగా.. శ్రేయస్​ అయ్యర్‌, పంత్‌ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడారు. ఈ మ్యాచ్​లో టాపార్డర్​ ధాటికి 387 పరుగుల భారీ స్కోరు చేసింది టీమిండియా. అనంతరం విండీస్‌ను 280 పరుగులకు ఆలౌట్‌ చేసింది. ఫలితంగా మూడు వన్డేల సిరీస్​ 1-1 తేడాతో సమమైంది. ఈ మ్యాచ్‌లో చైనామెన్‌ బౌలర్‌ కుల్దీప్‌ యాదవ్‌ హ్యాట్రిక్‌తో మెరిశాడు. ఈ ఏడాది ఆఖరి, కీలకమైన వన్డేలో విజయం సాధించాలని భావిస్తోంది కోహ్లీసేన.

ABOUT THE AUTHOR

...view details