ప్రస్తుతం టాపార్డర్‌లో రాణిస్తోన్న కేఎల్ రాహుల్‌ను.. టీ20 ప్రపంచకప్‌లో కీపర్‌గానూ పరిశీలించే అవకాశముందని కోచ్ రవిశాస్త్రి చెప్పిన తర్వాతి మ్యాచ్‌లోనే పంత్ తన ప్రదర్శనను మెరుగుపర్చుకున్నాడు. చెన్నైలోని చెపాక్ మైదానంలో తనదైన ఆటతీరు ప్రదర్శించాడు. ఫలితంగా కెరీర్లో తొలిసారి అర్ధశతకం నమోదు చేసుకున్నాడు. 49 బంతుల్లో 50 పరుగులు చేశాడు.
శ్రేయస్ అండతోనే...
ఈ ఏడాది ఐపీఎల్లో శ్రేయస్ సారథ్యంలోని దిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు అద్భుతమైన ప్రదర్శన చేసింది. బడా బడా జట్లకు షాకిస్తూ... సెమీస్ వరకు చేరింది. తాజాగా విండీస్‌తో జరిగిన తొలి వన్డేలోనూ శ్రేయస్ ఒక ఎండ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 70 బంతుల్లో అర్ధశతకం చేశాడు. కెరీర్లో ఐదో వన్డే హాఫ్ సెంచరీని ఖాతాలో వేసుకున్నాడీ దిల్లీ బ్యాట్స్‌మన్.
వీరిద్దరి ధాటికి..
80 పరుగులకే రాహుల్, విరాట్, రోహిత్ ఔటైనా.. ఈ యువ జోడీ కరీబియన్ జట్టు జోరును అడ్డుకున్నారు. ఇద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 114 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అనంతరం శ్రేయస్ 70 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు.