అండర్ 19 ప్రపంచకప్‌లో శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో భారత్ దంచి కొట్టింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియాలో యశస్వి జైస్వాల్(59), దివ్యాన్ష్ సక్సేనా(23) శుభారంభం చేశారు. తొలి వికెట్‌కు 66 పరుగులు జోడించారు. దివ్యాన్ష్ ఔటైన తర్వాత తిలక్ వర్మ(46)తో కలిసి యశస్వి మరో విలువైన భాగస్వామ్యం జోడించాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 66 పరుగులు జోడించారు.
అండర్-19: చితక్కొట్టిన భారత కుర్రాళ్లు
అండర్-19 ప్రపంచకప్ తొలి మ్యాచ్లో యువ భారత్ అదరగొట్టింది. నిర్ణీత ఓవర్లో ఆడి, ప్రత్యర్థి శ్రీలంకకు 298 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
భారత్-శ్రీలంక
యశస్వి ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన కెప్టెన్ ప్రియమ్ గార్గ్(56) బాధ్యతాయుతంగా ఆడాడు. తిలక్, ప్రియమ్ మూడో వికెట్ 59 పరుగులు జోడించారు. వీరిద్దరు ఔటయ్యాక ధ్రవ్‌జరేల్(52), సిద్దేశ్ వీర్ (44) ధాటిగా ఆడి భారత్ స్కోరును, నిర్ణీత ఓవర్లలో 297 పరుగులకు తీసుకెళ్లారు.