తెలంగాణ

telangana

ETV Bharat / sports

కొత్త ఏడాదిలో భారత్​ బోణీ... లంకతో టీ20 సిరీస్​ కైవసం - భారత్​-శ్రీలంక

పుణె వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో భారత్​ ఘన విజయం సాధించింది. టీమిండియా ఇచ్చిన 202 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 123 రన్స్​కే చేతులెత్తేశారు లంకేయులు. 78 పరుగుల తేడాతో గెలుపొందింది కోహ్లీ సేన. మూడు మ్యాచ్​ల సిరీస్​ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది.

India vs Sri Lanka, 3rd T20 match: India Won the 3 match Series with 2-0
కొత్త ఏడాదిలో భారత్​ బోణీ... లంకతో టీ20 సిరీస్​ కైవసం

By

Published : Jan 10, 2020, 10:12 PM IST

Updated : Jan 11, 2020, 12:08 AM IST

పుణె వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో భారత్​ విజయకేతనం ఎగురవేసింది. టీమిండియా ఇచ్చిన 202 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 123 పరుగుల​కే చేతులెత్తేశారు లంకేయులు. 78 పరుగుల తేడాతో గెలుపొందింది కోహ్లీ సేన. మూడు మ్యాచ్​ల సిరీస్​ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది.

202 పరుగుల లక్ష్య ఛేదనలో లంక జట్టు పూర్తిగా విఫలమైంది. భారత బౌలర్ల పేస్​ ధాటికి నిర్ణీత 16 ఓవర్లలో 123 పరుగులకే ఆలౌటైంది. ఏంజిలో మాథ్యూస్​ (31), డిసిల్వా (57) తప్ప ఎవరూ రాణించలేదు. మిగతా అందరూ ఒక్క అంకె స్కోరుకే పరిమితమయ్యారు.

సైనీ 3 వికెట్లు సాధించాడు. ఠాకూర్​, సుందర్​ చెరో రెండేసి వికెట్లు తీసుకున్నారు. బుమ్రా ఒక్క వికెట్​ సాధించాడు.

ధావన్​-రాహల్​ పోటాపోటీ..
టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా భారీ స్కోర్‌ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్‌ 54 పరుగులు(36 బంతుల్లో 5 ఫోర్లు,సిక్సర్​), శిఖర్‌ ధావన్‌ 52 రన్స్​(36 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్​) ధాటిగా ఆడారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 97 పరుగులు జోడించి శుభారంభం అందించారు. ధావన్‌, రాహుల్‌ జోడీ అర్ధ శతకాల తర్వాత ఒకరి తర్వాత ఒకరు తక్కువ వ్యవధిలో ఔటయ్యారు. వారితో పాటు సంజు శాంసన్‌(6), శ్రేయస్‌ అయ్యర్‌(4) నిరాశపరిచారు.

ఆరో స్థానంలో బ్యాటింగ్​కు వచ్చిన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ 26 పరుగులు (17 బంతుల్లో 2ఫోర్లు,సిక్సర్​), మనీశ్‌ పాండే 31 పరుగులు(18 బంతుల్లో 4ఫోర్లు) ధాటిగా ఆడి ఐదో వికెట్‌కు కీలకమైన 42 పరుగులు సాధించారు. చివర్లో కోహ్లీ, వాషింగ్టన్‌ సుందర్‌(0) ఔటైనా.. శార్దుల్‌ ఠాకుర్‌ 22 (8 బంతుల్లో పోరు, 2 సిక్సర్లు) వేగంగా ఆడటం వల్ల భారత్‌.. ప్రత్యర్థి శ్రీలంక ముందు 202 పరుగుల భారీ టార్గెట్‌ నిర్దేశించింది.

రికార్డులివే..

  • 2018 నవంబర్​ తర్వాత తొలిసారి 50పైగా స్కోరు చేశాడు ధావన్​. 15 టీ20 ఇన్నింగ్స్‌ల తర్వాత తొలి హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు. అంతేకాకుండా ఈ ఏడాది భారత తరఫున తొలి అర్ధశతకం సాధించాడు.
  • టీ20ల్లో ధావన్​-రాహుల్​ జోడీ తొలిసారి 97 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది.
  • 2005లో అరంగేట్రం చేసిన సంజు శాంసన్​.. దాదాపు 73 మ్యాచ్​ల తర్వాత మళ్లీ టీ 20 ఆడాడు. ఈ మ్యాచ్​లో 6 పరుగులే చేసి ఎల్బీగా వెనుదిరిగాడు. అయితే పుణె మైదానంలో ఈ కేరళ యువ క్రికెటర్​కు పెద్దగా రికార్డులు లేవు. గతంలో ఓ శతకం నమోదు చేసినా మూడు మ్యాచ్​ల్లో రెండంకెల స్కోరు కూడా చేయలేదు.
  • కోహ్లీ ఈ మ్యాచ్​లో ఒక పరుగు వ్యక్తిగత స్కోరు వద్ద కెప్టెన్​గా 11వేల మైలురాయిని అందుకున్నాడు. ఈ ఫీట్​ సాధించిన రెండో సారథి ఇతడే. గతంలో ధోనీ ఈ ఘనత సాధించాడు. అంతేకాకుండా తక్కువ ఇన్నింగ్స్​ల్లో(196) ఈ రికార్డు అందుకోవడం విశేషం.
  • ఈ మ్యాచ్​లో కోహ్లీ 250 ఫోర్ల మార్కు అందుకున్నాడు. టీ20ల్లో అత్యధిక ఫోర్లు కొట్టిన ఆటగాడిగా విరాట్​ పేరు తెచ్చుకున్నాడు. తర్వాతి స్థానంలో రోహిత్​(234), స్టిర్లింగ్​(233), దిల్షాన్​(223) తర్వాత స్థానంలో ఉన్నారు.
  • టీమిండియా టీ20ల్లో 200 పైగా స్కోరును ఈ మ్యాచ్​లో నమోదు చేసింది. ఇది 16వ సారి. తర్వాతి స్థానంలో ఆస్ట్రేలియా(12), దక్షిణాఫ్రికా(11) జట్లు ఉన్నాయి.
  • టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్​గా రికార్డు సృష్టించాడు బుమ్రా. వన్డేలు, టెస్టుల్లో మాజీ భారత బౌలర్​ కుంబ్లే అగ్రస్థానంలో ఉన్నాడు.
Last Updated : Jan 11, 2020, 12:08 AM IST

ABOUT THE AUTHOR

...view details