పుణెలో లంకతో జరుగుతోన్న మూడో టీ20లో మొదట బ్యాటింగ్ చేసిన కోహ్లీ సేన... నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది.
ఓపెనర్ల శుభారంభం..
పుణెలో లంకతో జరుగుతోన్న మూడో టీ20లో మొదట బ్యాటింగ్ చేసిన కోహ్లీ సేన... నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది.
ఓపెనర్ల శుభారంభం..
భారత ఓపెనర్లు కేఎల్ రాహుల్ (54), ధావన్ (52) అర్ధశతకాలతో రాణించారు. లంక బౌలర్లపై మొదటి నుంచే ధాటిగా ఆడారు. ఇద్దరూ తొలిసారి టీ20ల్లో 97 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. తొలి వికెట్‌గా ధావన్ ఔట్ కాగా.. తర్వాత స్థానంలో వచ్చిన సంజు శాంసన్ తొలి బంతికి సిక్సర్ కొట్టినా... తర్వాత బంతికి ఎల్బీగా ఔటయ్యాడు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ (4), కోహ్లీ (26), వాషింగ్టన్ సుందర్ (0) తక్కువకే ఔటయ్యారు. మనీశ్ పాండే(31), శార్దుల్(22) మెరుపులతో భారత్ భారీ స్కోరు చేసింది.
ఈ మ్యాచ్‌లో అవకాశం దక్కించుకున్న లంక్ బౌలర్ సందకన్ మూడు వికెట్లు తీసి భారత దూకుడుకు అడ్డుకట్ట వేశాడు. మిగతా బౌలర్లలో కుమార, హసరంగ చెరో వికెట్ తీసుకున్నారు.
తొలి టీ20 వర్షం కారణంగా రద్దవ్వగా.. రెండో మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌లో లంక 202 పరుగులు చేయాల్సి ఉంది.