విజయంతో కొత్త ఏడాది ఘనంగా ఆరంభించాలనుకున్న టీమిండియా, శ్రీలంకకు తొలి టీ20 మ్యాచ్‌కు వరుణుడు అడ్డుతగిలాడు. కానీ నేడు ఇండోర్ వేదికగా జరగనున్న మ్యాచ్‌కు వాతావరణం పూర్తిగా సహకరిస్తుందని సమాచారం. టాస్ గెలిచిన భారత జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఈ ఏడాది రెండోసారి టాస్ గెలిచాడు విరాట్ కోహ్లీ. గత మ్యాచ్‌కు ప్రకటించిన తుది జట్లతోనే బరిలోకి దిగుతున్నారు.
భారత జట్టులో సంజు శాంసన్, మనీశ్ పాండే, చాహల్, జడేజా తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయారు. లంక జట్టులో చాలా ఏళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన మాథ్యూస్‌కు చోటు లభించలేదు.