2019ని భారత జట్టు అద్భుతమైన ప్రదర్శనతో ముగించింది. డిసెంబర్‌లో వెస్టిండీస్‌తో మూడు టీ20ల సిరీస్, మూడు వన్డేల సిరీస్‌ను గెలుపొంది జయకేతనం ఎగురవేసింది. 2019లో వన్డే ప్రపంచకప్ వల్ల ఈ ఫార్మాట్ పైనే దృష్టి పెట్టిన కోహ్లీసే... ఈ ఏడాది పొట్టి క్రికెట్‌పై కన్నేసింది. అక్టోబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ జరగడం ఇందుకు కారణం. ఈ మెగాటోర్నీ ముందు భారత్ దాదాపు 15 టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఇందులో భాగంగానే నేటి నుంచి 9 వరకు శ్రీలంకతో మూడు పొట్టి ఫార్మాట్ మ్యాచ్‌లు ఆడనుంది. గువాహటి వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌లో విజయం సాధించి.. ఈ ఏడాదికి ఘనస్వాగతం పలకాలని భావిస్తోంది 'మెన్ ఇన్ బ్లూ'.
ధావన్ ఇన్... రోహిత్ ఔట్
గతేడాది వరుస శతకాలతో చెలరేగిన టీమిండియా డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ... శ్రీలంకతో పొట్టి సిరీస్‌కు దూరమయ్యాడు. అతడికి విశ్రాంతినిచ్చి.. గాయం నుంచి కోలుకున్న శిఖర్ ధావన్‌ను జట్టులోకి తీసుకుంది టీమిండియా. ఫలితంగా కేఎల్ రాహుల్‌కు జోడీగా ఈ దిల్లీ బ్యాట్స్‌మన్ బరిలోకి దిగనున్నాడు. ఇటీవలే హైదరాబాద్‌తో జరిగిన రంజీ మ్యాచ్‌లో ధావన్ శతకంతో చెలరేగి మళ్లీ ఫామ్ నిరూపించుకున్నాడు. లంకతో తొలి మ్యాచ్‌లో ఎలా రాణిస్తాడనేదే ఆసక్తికరం.
బుమ్రా ప్రదర్శన కీలకం..
వెన్నునొప్పి కారణంగా దాదాపు నాలుగు నెలలు ఆటకు దూరమైన టీమిండియా స్పీడ్‌స్టర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులో చేరాడు. శ్రీలంకతో తొలి టీ20లో మైదానంలో బంతి అందుకోనున్నాడు. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డే సందర్భంగా బుమ్రా.. రోహిత్, ధావన్‌కు బంతులేశాడు. ఈ మ్యాచ్‌కు ముందు నెట్స్‌లో విపరీతంగా సాధన చేశాడు.
సంజుకు అవకాశం దక్కేనా..?
టీమిండియా యువ బ్యాట్స్‌మన్ సంజూ శాంసన్ అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. నవంబర్, డిసెంబర్‌లో జరిగిన బంగ్లాదేశ్, వెస్టిండీస్ సిరీస్‌లకు ఎంపికైనా... తుది జట్టులో స్థానం దక్కలేదు. ఇప్పుడు శ్రీలంకతో పొట్టి సిరీస్‌కు ఎంపికయ్యాడు. అయితే అతడికి ఆడే అవకాశం వస్తుందో లేదో తెలియదు. గతేడాది ఐపీఎల్‌లో అదరగొట్టిన సంజూ... సెలక్టర్ల దృష్టిని ఆకర్షించి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు.
స్పిన్ ద్వయంలో ఎవరు.?
టీమిండియా స్పిన్ బౌలింగ్‌లో యుజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ చాలా కీలకం. పరిమిత ఓవర్లలో రాణిస్తున్న ఇద్దరూ శ్రీలంకతో పొట్టి సిరీస్‌కు ఎంపికయ్యారు. అయితే ఇద్దరిలో ఒకరికి మాత్రమే తుది జట్టులో అవకాశం లభిస్తుంది. ఆల్రౌండర్లుగా శివం దూబె, రవీంద్ర జడేజా ఉన్నారు. పేస్ విభాగంలో దీపక్ చాహర్, మహ్మద్ షమి దూరమవడం వల్ల బుమ్రాకు తోడుగా నవ్‌దీప్ సైనీ, శార్దూల్ ఠాకుర్ బరిలోకి దిగనున్నారు.
మలింగ సారథ్యంలో...