2020లో టీమిండియా ఆడిన తొలి టీ20 వర్షార్పణమైంది. టాస్ అనంతరం మ్యాచ్ ప్రారంభమయ్యే సమయంలో అరగంటకు పైగా ఏకధాటిగా వర్షం కురిసింది. ఫలితంగా పిచ్ చిత్తడిగా మారింది. మైదానాన్ని సిద్ధం చేసేందుకు వాక్యూమ్ క్లీనర్లు, రోలర్లు ఉపయోగించి సిబ్బంది తీవ్రంగా కష్టపడినా.. పిచ్ సిద్ధం కాలేదు. రెండుసార్లు మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు బంతి పడకుండానే... మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
భారత్-శ్రీలంక మ్యాచ్ వర్షార్పణం... బంతి పడకుండానే రద్దు - Match start delayed due to wet outfield
గువాహటి వేదికగా భారత్-శ్రీలంక మధ్య మ్యాచ్కు తొలి టీ20 మ్యాచ్ రద్దయింది. వర్షం కారణంగా పిచ్ చిత్తడిగా మారింది. సిబ్బంతి చాలా ప్రయత్నించినా కుదరలేదు. రెండుసార్లు మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు మ్యాచ్ నిలిపేస్తున్నట్లు ప్రకటించారు.
శ్రీలంక-భారత్ టీ20 మ్యాచ్ ఆలస్యమా..?
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత జట్టు సారథి విరాట్ కోహ్లీ... బౌలింగ్ ఎంచుకున్నాడు. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా రెండో టీ20 ఇండోర్ వేదికగా ఈ నెల 7న జరగనుంది.
Last Updated : Jan 5, 2020, 10:10 PM IST
TAGGED:
India vs Sri Lanka, 1st T20