టీమిండియా-సఫారీ జట్లు ఈరోజు మొహాలీ వేదికగా టీ20 మ్యాచ్‌లో తలపడనున్నారు. 2015లో సఫారీల చేతిలో సొంతగడ్డపై ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది కోహ్లీసేన. మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది.
వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్‌కప్ జరగనున్న నేపథ్యంలో... పొట్టి ఫార్మాట్‌పై అందరూ దృష్టి పెట్టారు. యువ ఆటగాళ్లు తమ ప్రతిభ నిరూపించుకునేందుకు ఇదొక మంచి అవకాశం. ధోనీ స్థానంలో చోటు దక్కించుకున్న యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్... తన కెరీర్‌లో తొలిసారి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నాడు. 2017లోనే ఈ ఫార్మాట్లో అడుగుపెట్టిన పంత్‌పై అంచనాలకు మించి ఆశలుపెట్టుకుంది భారత జట్టు.
ఆడకపోతే వేటు తప్పదు..!
రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీతో భారత టాపార్డర్ దుర్భేద్యంగా ఉంది. మిడిల్ ఆర్డర్లో శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్య, జడేజా నిలకడగా ఆడుతున్నారు. నాలుగో స్థానంలో మనీశ్ పాండే, శ్రేయస్ అయ్యర్ మధ్య పోటీ నెలకొంది. వీరిద్దరిలో ఒకరికి తుది జట్టులో చోటు దక్కనుంది.
- టీ20 వరల్డ్‌కప్ కోసం బలమైన జట్టుని రూపొందించేందుకు ప్రయత్నాల్లో ఉన్న యాజమాన్యానికి... పంత్ ప్రదర్శన చాలా ముఖ్యం. ఒకవేళ ఈ సిరీస్‌లో అతడు విఫలమైతే... మరో యువ వికెట్ కీపర్ సంజూ శాంసన్‌కు చోటు దక్కే అవకాశముంది.
- చైనామన్ స్పిన్నర్లు కుల్దీప్, చాహల్‌ను కాదని రాహుల్ చాహర్, వాషింగ్టన్ సుందర్‌ను పరీక్షించనున్నారు సెలక్టర్లు. ఈ యువ బౌలర్లు తమ సత్తా నిరూపించుకోవాల్సి ఉంది.
- బుమ్రాకు విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో ఖలీల్ అహ్మద్, నవదీప్ సైనీ, దీపక్ చాహర్ లాంటి యువ పేసర్లు బౌలింగ్ విభాగాన్ని నడిపించనున్నారు.
- ఆల్‌రౌండర్ల జాబితాలో పాండ్య సోదరులిద్దరిలో ఒకరిని తీసుకుంటారో.. లేదా ఇద్దరికీ అవకాశం కల్పిస్తారో చూడాలి.
పేస్ సఫారీల బలం...