భారత్తో జరిగిన రెండు టెస్టుల్లో పరాజయం చెందిన దక్షిణాఫ్రికా జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు బౌలర్ కేశవ్ మహరాజ్ భుజం గాయం కారణంగా మూడో టెస్టుకు దూరం కానున్నాడు. ఈ విషయాన్ని సఫారీ క్రికెట్ బోర్డు ప్రకటించింది.
పుణెలో జరిగిన రెండో టెస్టులో ఫీల్డింగ్ చేస్తున్నపుడు కేశవ్ కుడి భుజానికి గాయమైంది. అనంతరం ఎమ్ఆర్ఐ స్కాన్ ఫలితాలను పరిశీలించిన వైద్యులు అతడికి విశ్రాంతి అవసరమని తెలిపారు. మూడో టెస్టుకు మహరాజ్ స్థానంలో స్పిన్నర్ జార్జి లిండే జట్టులోకి రానున్నాడు.