తెలంగాణ

telangana

ETV Bharat / sports

దంచికొట్టిన కోహ్లీ... కష్టాల్లో సఫారీలు - india vs south africa test

పుణె వేదికగా  దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు టీమిండియా జోరు కొనసాగింది. భారత జట్టు సారథి కోహ్లీ ద్విశతకంతో చెలరేగగా... భారీ స్కోరు సాధించింది టీమిండియా. లక్ష్య ఛేదనలో 36 రన్స్​కే 3 వికెట్లు కోల్పోయింది సఫారీ జట్టు.

దంచికొట్టిన కోహ్లీ... కష్టాల్లో సఫారీలు

By

Published : Oct 11, 2019, 6:06 PM IST

పుణె వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజూ టీమిండియా జోరు కొనసాగింది. సారథి కోహ్లీ డబుల్​ సెంచరీతో సత్తా చాటగా.. జడేజా 91 పరుగులతో తనదైన సహకారం అందించాడు. ఫలితంగా టీమిండియా 601 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్​ను డిక్లేర్ చేసింది. లక్ష్య ఛేదనలో 36 రన్స్​కే 3 వికెట్లు కోల్పోయింది సఫారీ జట్టు.

కోహ్లీ మరోసారి..

ఓవర్​నైట్ స్కోర్ 273 పరుగులతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు రహానే, కోహ్లీ నాలుగో వికెట్​కు మంచి భాగస్వామ్యాన్ని అందించారు. రహానే 59 పరుగులు చేసి ఔటయ్యాక జడేజాతో కలిసి మరో వికెట్ పడకుండా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు విరాట్​. ఈ క్రమంలో డబుల్ సెంచరీని సాధించాడు. 91 పరుగులు(104 బంతుల్లో; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసిన జడేజా ముత్తుసామి బౌలింగ్​లో ఔట్ కాగా.. కోహ్లీ డిక్లేర్ ప్రకటించాడు. అప్పటికీ విరాట్ 254* పరుగులు(336 బంతుల్లో; 33 ఫోర్లు, 2 సిక్సర్లు) క్రీజులో ఉన్నాడు.

మూడు వికెట్లు ఢమాల్‌..

తొలి ఇన్నిగ్స్​లో బ్యాటింగ్‌కు దిగిన సఫారీ జట్టును పేసర్‌ ఉమేష్‌ యాదవ్‌ దెబ్బ తీశాడు. తొలిటెస్టులో స్థానం దక్కించుకోలేకపోయిన ఈ ఆటగాడు.. ఈ మ్యాచ్​లో రెండు వికెట్లతో సత్తా చాటాడు. దక్షిణాఫ్రికా జట్టు స్కోరు రెండు పరుగుల వద్ద మర్కరమ్‌ (0), 13 పరుగుల వద్ద ఎల్గర్‌ (​‍6)ను పెవిలియన్‌ పంపాడు. మూడో వికెట్‌గా బవుమా (8)ను ఔట్​ చేశాడు షమి. 15 ఓవర్లకు 36/3 గా ఉన్న సమయంలో రెండో రోజు ఆట ముగిసింది. క్రీజులో డి బ్రూయిన్‌ (7), బవుమా (7) ఉన్నారు. టీమిండియా కంటే 581 పరుగుల వెనుకంజలో ఉంది దక్షిణాఫ్రికా జట్టు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details