తెలంగాణ

telangana

ETV Bharat / sports

సఫారీలను ఆదుకున్న డికాక్​... భారత్​ లక్ష్యం 150

మొహాలి వేదికగా టీమిండియాతో జరిగిన టీ20 మ్యాచ్​లో సఫారీలు ఆశించిన మేరకు రాణించలేకపోయారు. తొలుత బ్యాటింగ్​ చేసిన ప్రొటీస్​ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 149 పరుగులు చేసింది. సఫారీ సారథి డికాక్​ అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు.

By

Published : Sep 18, 2019, 8:44 PM IST

Updated : Oct 1, 2019, 2:56 AM IST

ఆదుకున్న డికాక్​... భారత్​ లక్ష్యం 150

భారత్​-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న టీ20 మ్యాచ్​లో సఫారీ జట్టు సాధారణ ప్రదర్శన చేసింది. మొహాలీ వేదికగా జరుగుతున్న పోరులో టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన డికాక్​ సేన... నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. సఫారీ బ్యాట్స్​మెన్లలో డికాక్, భవుమా ఆకట్టుకున్నారు.

డికాక్​ దూకుడు...

ఆరంభంలోనే దక్షిణాఫ్రికా జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్​గా బరిలోకి దిగిన రీజా హెండ్రిక్స్​ తక్కువ స్కోరుకే ఔటయ్యాడు. 6 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద తొలి వికెట్​గా వెనుదిరిగాడు. అయితే మరో ఓపెనర్​ డికాక్ తనదైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.​ అర్ధశతకంతో రాణించిన ప్రోటీస్​ సారథి... 52 పరుగులు (37 బంతుల్లో; 8 ఫోర్లు) సాధించాడు. కోహ్లీ అద్భుతమైన క్యాచ్​తో డికాక్​ను పెవీలియన్​కు పంపాడు. మరో బ్యాట్స్​మెన్​ భవుమా 49 పరుగులు (43 బంతుల్లో; 3 ఫోర్లు, 1సిక్సర్​) చేసి తృటిలో అర్ధశతకం కోల్పోయాడు. మిగిలిన ఆటగాళ్లు ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేదు. డసెన్​(1), మిల్లర్​(18), ప్రిటోరియస్​(10*), ఫెలుక్వాయో(8*) పరుగులు చేశారు.

భారత బౌలర్లలో దీపక్​ చాహర్​ పొదుపుగా బౌలింగ్​ చేశాడు. 4 ఓవర్లలో 22 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. సైనీ, జడేజా, హార్దిక్​ పాండ్య తలో వికెట్​ తమ ఖాతాలో వేసుకున్నారు.

Last Updated : Oct 1, 2019, 2:56 AM IST

ABOUT THE AUTHOR

...view details