భారత్-పాకిస్థాన్ దాయాది జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగితే అది ప్రపంచ క్రికెట్‌కు మంచిదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ ఎహ్‌సన్ మణి అభిప్రాయపడ్డారు. తాజాగా క్రిక్‌బజ్ చేసిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు.
"భారత్-పాక్ మ్యాచ్‌కు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది. ఈ మ్యాచ్‌లకు అత్యధిక వీక్షకులు ఉంటారు. ఐసీసీ లేదా ఏసీసీ ఈవెంట్లలో తప్ప ఇరు జట్లు ద్వైపాక్షిక క్రికెట్ ఆడటం లేదు. దాయాది జట్లు తలపడితే అది ప్రపంచ క్రికెట్‌కు చాలా మంచిది. అయితే, మేం మాత్రం భారత్‌తో ఆడాలనే ప్రణాళికలు రూపొందించడం లేదు. కానీ కొన్ని బోర్డులు తమ తాత్కాలిక ఉద్దేశాలను పక్కనపెట్టి ఆట మంచి కోసం కృషిచేయాలి."
-ఎహ్‌సన్, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్.