తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ప్రత్యర్థి ఎవరైనా టీమిండియా జోరులో మార్పు లేదు' - Kane Williamson

న్యూజిలాండ్​తో ఆక్లాండ్​ వేదికగా జరిగిన తొలి టీ20లో భారత్​ అద్భుత ప్రదర్శన చేసింది. 200 పైచిలుకు లక్ష్యాన్ని ఛేదించి 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్​ ముగిసిన రెండ్రోజుల్లోనే న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లి సత్తా చాటింది టీమిండియా. తాజాగా ఈ విజయంపై మాట్లాడాడు విరాట్​ కోహ్లీ.

India vs Newzeland 2020
ఈ విజయంతో న్యూజిలాండ్​ సిరీస్​లో కిక్క్​ వచ్చింది: కోహ్లీ

By

Published : Jan 24, 2020, 7:51 PM IST

Updated : Feb 18, 2020, 6:53 AM IST

స్వదేశంలో వరుస విజయాలతో జోరు చూపించిన భారత జట్టు.. విదేశీ గడ్డపైనా అద్భుత ప్రదర్శన చేసింది. వరుసగా మరో గెలుపు ఖాతాలో వేసుకుంది. న్యూజిలాండ్​తో ఈరోజు ఆక్లాండ్​ వేదికగా జరిగిన తొలి టీ20లో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది కోహ్లీసేన. ఫలితంగా ఐదు మ్యాచ్​ల సిరీస్​లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్​లో 204 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్​ అలవోకగా ఛేదించడం విశేషం. మ్యాచ్​ అనంతరం మాట్లాడిన సారథి కోహ్లీ.. కివీస్​ గడ్డపై అడుగుపెట్టిన రెండ్రోజుల్లోనే 'మెన్​ ఇన్​ బ్లూ' మెరుగైన ప్రదర్శన చేసిందని అభిప్రాయపడ్డాడు. తాజా విజయంతో సిరీస్​కు కిక్కిచ్చే ఆరంభం లభించిందని అభిప్రాయపడ్డాడు.

"ఈ విజయాన్ని మేం ఆస్వాదిస్తున్నాం. రెండు రోజుల ముందే ఇక్కడ దిగి ఇలా ఆడామంటే అద్భుతం. ఈ విజయం మొత్తం సిరీస్‌ను నిర్దేశిస్తుంది. ప్రేక్షకుల్లో 80 శాతం మంది మాకే మద్దతిచ్చినట్టు అనిపించింది. 200+ లక్ష్యాన్ని ఛేదిస్తున్నప్పుడు అలాంటి మద్దతు కచ్చితంగా అవసరం. జట్టులో మేమెవ్వరం వరుస సిరీస్​లతో అలసటకు గురైనట్లు భావించట్లేదు. ఎందుకంటే సాకులు మాకు అక్కర్లేదు"

--విరాట్​ కోహ్లీ, టీమిండియా సారథి

తప్పులు సరిదిద్దుకుంటాం...

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ గెలవడమే న్యూజిలాండ్​లో పోరాడేందుకు ప్రేరణనిచ్చిందని అన్నాడు విరాట్​. ఇలాంటి పిచ్‌పై ఆడుతున్నప్పుడు ఎవరినీ నిందించలేమని చెప్పిన టీమిండియా కెప్టెన్.. ఆరంభంలో పరుగులిచ్చినా మధ్య ఓవర్లలో పుంజుకొని కివీస్‌ను 210లోపే కట్టడి చేశామని చెప్పాడు. అయితే ఫీల్డింగ్‌ ఇంకా మెరుగుపర్చుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డాడు. జారిపోతున్న బంతులను పట్టుకొనేందుకు మైదానాలు అలవాటు అవ్వాలని కోహ్లీ తెలిపాడు. ఎందుకంటే ఆక్లాండ్‌ మైదానంలో కీపర్‌, బౌలర్‌ వెనక బౌండరీలు చిన్నవిగా ఉంటాయని వాటిపై కాస్త దృష్టి సారిస్తామని పేర్కొన్నాడు.

ఈ మ్యాచ్​లో 203 పరుగుల లక్ష్యాన్ని.. అలవోకగా ఛేదించింది కోహ్లీసేన. రాహుల్​(56), శ్రేయస్​(58)అర్ధశతకాలతో రాణించగా.. కోహ్లీ (45) మంచి ఇన్నింగ్స్​ ఆడాడు. అంతకుముందు కొలిన్​ మున్రో(59), విలియమ్సన్​(51), రాస్​ టేలర్​(54*) అర్ధశతకాలతో రాణించడం వల్ల కివీస్​ 203 పరుగుల భారీ స్కోరు సాధించింది.

నాలుగోసారి....

>> ఈ మ్యాచ్​లో 200 పైగా లక్ష్యాన్ని ఛేదించిన కోహ్లీ సేన.. నాలుగుసార్లు టీ20ల్లో భారీ స్కోరు ఛేదించిన జట్టుగా చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియా రెండు సార్లు మాత్రమే ఇంత భారీ లక్ష్యాన్ని ఛేదించింది.

>> న్యూజిలాండ్​ జట్టు మీద ఇప్పటివరకు ఎప్పుడూ 5 టీ20ల సిరీస్​లో పోటీ పడలేదు భారత్. 2009లో 2 మ్యాచ్​ల టీ20 సిరీస్​ తర్వతా తొలిసారి ఈ ఫార్మాట్​లో ఇన్ని మ్యాచ్​లు ఆడుతోంది.

>> ఇప్పటివరకు న్యూజిలాండ్​, భారత్​ 11 టీ20ల్లో తలపడ్డాయి. అన్నింటిలో ధోనీ ఉన్నాడు. ఈ మ్యాచ్​లో మహీ లేకుండా బరిలోకి దిగడం విశేషం.

ధోనీ లేకుండా ఆడిన టీమిండియా
Last Updated : Feb 18, 2020, 6:53 AM IST

ABOUT THE AUTHOR

...view details