తెలంగాణ

telangana

ETV Bharat / sports

టెస్టు ఛాంపియన్​షిప్​: గంగూలీ రికార్డుపై కోహ్లీ కన్ను

బీసీసీఐ ప్రస్తుత అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్​ గంగూలీ రికార్డుపైనే కన్నేశాడు ప్రస్తుత సారథి విరాట్​ కోహ్లీ. టెస్టుల్లో అత్యధిక పరుగులు వీరుల జాబితాలో దాదాను వెనక్కి నెట్టి ఆరోస్థానం కైవసం చేసుకోనున్నాడు కోహ్లీ.

india vs new zeland
టెస్టు ఛాంపియన్​షిప్​: గంగూలీ రికార్డుపై కోహ్లీ కన్ను

By

Published : Feb 20, 2020, 5:59 PM IST

Updated : Mar 1, 2020, 11:38 PM IST

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ కోల్పోయిన భారత్.. టెస్టు పోరుకు సిద్ధమవుతోంది. ప్రతిష్టాత్మక ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఇరుజట్ల రెండు మ్యాచ్​లు ఆడనున్నాయి. వెల్లింగ్టన్​​ వేదికగా రేపు(శుక్రవారం) తొలి టెస్టు​ మొదలు కానుంది. ఓ రికార్డును అందుకునేందుకు కోహ్లీ కొన్ని పరుగుల దూరంలో ఉన్నాడు.

విరాట్​ కోహ్లీ

11 పరుగుల దూరంలో

తొలి మ్యాచ్​లో కోహ్లీ మరో 11 పరుగులు చేస్తే, భారత్​ తరఫున అత్యధిక పరుగులు చేసిన టెస్టు ఆటగాళ్ల జాబితాలో ఆరో స్థానంలో నిలుస్తాడు​. ఈ స్థానంలో ఉన్న మాజీ సారథి గంగూలీని అధిగమించనున్నాడు.

ఈ జాబితాలో వరుసగా దిగ్గజ క్రికెటర్లు సచిన్‌ తెందుల్కర్‌ (15,921), రాహుల్‌ ద్రవిడ్‌ (13,288), సునీల్‌ గవాస్కర్ (10,122), వీవీఎస్‌ లక్ష్మణ్‌ (8,718), వీరేంద్ర సెహ్వాగ్‌ (8,586), గంగూలీ (7,212) ఉన్నారు. దాదా కంటే కోహ్లీ 11 పరుగుల వెనుకంజలో (7202) ఉన్నాడు. ఇప్పటి వరకు టెస్టు ఛాంపియన్‌షిప్‌లో దాదాపు ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ విజయం సాధించి, పాయింట్ల పట్టికలో ప్రథమ స్థానంలో ఉంది టీమిండియా.

Last Updated : Mar 1, 2020, 11:38 PM IST

ABOUT THE AUTHOR

...view details