తెలంగాణ

telangana

ETV Bharat / sports

'మూడో స్థానమంటే ఇష్టం.. అందుకు సమయం పడుతుంది' - మూడో స్థానమంటే ఇష్టం మనీష్ పాండే

న్యూజిలాండ్​తో నాలుగో టీ20లో అర్ధశతకంతో రాణించాడు టీమిండియా బ్యాట్స్​మెన్ మనీశ్ పాండే. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ తనకు మూడో స్థానంలో బ్యాటింగ్ చేయడమే ఇష్టమని చెప్పాడు.

మనీష్
మనీష్

By

Published : Feb 1, 2020, 8:48 AM IST

Updated : Feb 28, 2020, 6:06 PM IST

మాట్లాడుతున్న మనీష్

న్యూజిలాండ్​తో నాలుగో టీ20లో భారత్ ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్​కు దిగిన టీమిండియా.. నిర్ణీత ఓవర్లలో 165 పరుగులు చేసింది. ఈ స్కోరు సాధించడానికి కారణం మనీశ్ పాండే అర్ధశతకం అని చెప్పుకోవచ్చు. ఈ సిరీస్​లో బ్యాటింగ్​కు ఎక్కువగా రాకపోయినా.. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడీ యువ క్రికెటర్. ఈ మ్యాచ్ విజయానంతరం మాట్లాడుతూ ఎప్పుడూ మూడో స్థానంలో బ్యాటింగ్​కు రావడమే తనకిష్టమని చెప్పాడు.

"ఐదు, ఆరు ఏ స్థానంలో బ్యాటింగ్ చేస్తామన్నది ముఖ్యం కాదు. జట్టు నాకు ఆరో స్థానంలో బ్యాటింగ్​ చేసే అవకాశం కల్పించింది. ఈ మ్యాచ్​లో నా ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నా. కానీ మూడో స్థానంలో బ్యాటింగ్​కు​ రావడానికే మొగ్గుచూపుతా. అందుకు ఇంకా సమయం పడుతుందని అనుకుంటున్నా. ప్రస్తుతం జట్టులో గట్టిపోటీ ఉంది. ఏ స్థానంలో బ్యాటింగ్​కు దిగాలన్నా సమ్మతమే. జట్టు విజయంలో పాత్ర పోషించడమే ముఖ్యం" -మనీశ్ పాండే, టీమిండియా బ్యాట్స్​మన్

ఈ మ్యాచ్​లో 88 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ భారత్​ను, మనీశ్ పాండే అర్ధసెంచరీతో ఆదుకున్నాడు. శార్దూల్, ఠాకూర్​తో కలిసి జట్టు స్కోరు 165 పరుగులు చేయడంలో కీలక పాత్ర వహించాడు. అనంతరం బ్యాటింగ్​ చేసిన కివీస్​.. నిర్ణీత 20 ఓవర్లలో 165 పరుగులు చేయడం వల్ల మ్యాచ్​ సూపర్ ఓవర్​కు దారితీసింది.

ఈ సూపర్ ఓవర్​లో తొలుత కివీస్​ 13 పరుగులు చేసింది. 14 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాను రాహుల్, కోహ్లీ విజయతీరాలకు చేర్చారు.

ఇవీ చూడండి.. అండర్​- 19 ప్రపంచకప్​: సెమీఫైనల్లో భారత్ X పాకిస్థాన్​

Last Updated : Feb 28, 2020, 6:06 PM IST

ABOUT THE AUTHOR

...view details