భారత జట్టు యువ ఆల్‌రౌండర్ శివమ్ దూబే.. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో ఆకట్టుకోలేకపోయాడు. బ్యాటింగ్‌లోనే కాకుండా బౌలింగ్‌లోనూ నిరాశపర్చాడు. సిరీస్ మొత్తంలో 41 పరుగులే చేసిన ఈ క్రికెటర్... కివీస్‌తో ఆఖరి టీ20లో బంతితోనూ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఓ ఓవర్‌లో అత్యధిక పరుగులిచ్చిన రెండో బౌలర్‌గా నిలిచాడు. స్టువర్ట్ బ్రాడ్ 36 పరుగుల తర్వాత దూబే తర్వాతి స్థానం దక్కించుకున్నాడు. భారత్ తరఫున ఇప్పటివరకు స్టువర్ట్ బిన్నీ(32 పరుగులు) పేరిట ఉన్న రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
దూబే ఖాతాలో చెత్త రికార్డు.. ఓవర్‌లో 34 రన్స్ - new Zealand batsmen Ross Taylor and Tim Seifert
టీమిండియా యువ ఆల్‌రౌండర్ శివమ్ దూబే కెరీర్లో చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. పొట్టి ఫార్మాట్లో అత్యధిక పరుగులిచ్చిన రెండో బౌలర్‌గా నిలిచాడు. న్యూజిలాండ్‌తో జరిగిన ఐదో టీ20లో ఈ రికార్డు నమోదైంది.
కివీస్‌తో ఐదో టీ20లో 10 ఓవర్ వేసిన దూబే... మొత్తంగా 34 పరుగులిచ్చాడు. ఆ ఓవర్‌లో న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ సీఫెర్ట్-రాస్ టేలర్‌లు చెలరేగిపోయారు. సీఫెర్ట్ రెండు సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టగా... టేలర్ రెండు సిక్స్‌లు, ఫోర్ బాదేశాడు. అందులో ఒకటి నో బాల్ కాగా, మరొక సింగిల్ లభించింది.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. భారత్ జట్టులో కేఎల్ రాహుల్(45; 33 బంతుల్లో 4 ఫోర్లు, 2సిక్సర్లు), రోహిత్ శర్మ(60 రిటైర్డ్ హర్ట్; 41 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) సాధించారు. ఈ ఇద్దరితో పాటు శ్రేయస్ అయ్యర్(33 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్సర్లు)తో ఫర్వాలేదనిపించాడు.