తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీ20: కోహ్లీ లేకుండానే బరిలోకి.. భారత్ బ్యాటింగ్ - cricket news

ఐదో టీ20లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది టీమిండియా. ఈ మ్యాచ్​లో కోహ్లీకి బదులుగా రోహిత్ శర్మ కెప్టెన్​గా వ్యవహరించనున్నాడు.

టీ20: కోహ్లీ లేకుండానే బరిలోకి.. భారత్ బ్యాటింగ్
భారత్ న్యూజిలాండ్ మ్యాచ్​

By

Published : Feb 2, 2020, 12:08 PM IST

Updated : Feb 28, 2020, 9:06 PM IST

న్యూజిలాండ్​తో జరుగుతున్న చివరి టీ20లో టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటికే 4-0తో సిరీస్​లో ఆధిక్యంలో ఉన్న టీమిండియా.. ఇందులోనూ గెలిచి ప్రత్యర్థిని వైట్​వాష్ చేయాలని చూస్తోంది. అదే సమయంలో.. గెలిచి, పరువు నిలుపుకోవాలని కివీస్ చూస్తోంది.

బే ఓవల్ మైదానం

న్యూజిలాండ్‌ గడ్డపై భారత్‌ ఇప్పటివరకు టీ20 సిరీస్‌ గెలవలేదు. 2009లో ధోనీ సారథ్యంలోని జట్టు 0-2తో ఓటమి పాలైంది. గతేడాది మూడు మ్యాచ్​ల సిరీస్‌ 1-2తో చేజారింది. అయితే తాజా సిరీస్​లో నాలుగు​ విజయాలు సాధించిన కోహ్లీ సేన.. ఇప్పటికే కివీస్​ గడ్డపై ట్రోఫీ ఖాయం చేసుకుంది. అయితే ఐదు మ్యాచ్​లు గెలిస్తే.. 'మెన్​ ఇన్​ బ్లూ' టీ20 ర్యాంకింగ్స్​లో మరింత ముందుకెళ్తుంది. ఎప్పటినుంచో ఐదో స్థానానికే పరిమితమైన భారత్​.. మెరుగైన ప్రదర్శన చేస్తే ఒక ర్యాంకు మెరుగుపడి నాలుగోస్థానానికి ఎగబాకొచ్చు.

జట్లు

భారత్
రోహిత్​శర్మ ( కెప్టెన్​), సంజు శాంసన్​, కేఎల్​ రాహుల్​ (కీపర్​)​, శ్రేయస్ అయ్యర్, మనీశ్ పాండే, వాషింగ్టన్​ సుందర్​, శివమ్ దూబే, చాహల్, బుమ్రా, సైని, శార్దూల్​

న్యూజిలాండ్

టామ్‌ బ్రూస్‌, మార్టిన్ గప్తిల్, కొలిన్ మన్రో, రాస్ టేలర్, మిచెల్ సాంట్నర్, టిమ్ సీఫెట్, ఇష్ సోదీ, టిమ్ సౌతీ(కెప్టెన్), స్కాట్​ కగ్గిలిన్​, డారెల్​ మిచెల్​

Last Updated : Feb 28, 2020, 9:06 PM IST

ABOUT THE AUTHOR

...view details