తెలంగాణ

telangana

ETV Bharat / sports

మూడో టీ20: కెప్టెన్​గా ధోనీ రికార్డుపై కోహ్లీ గురి - విరాట్​ కోహ్లీ

పరుగుల రారాజు, టీమిండియా సారథి విరాట్​ కోహ్లీ మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. 25 రన్స్​ చేస్తే.. కెప్టెన్​గా అత్యధిక పరుగులు చేసిన జాబితాలో మాజీ కెప్టెన్​ ధోనీని వెనక్కి నెట్టే అవకాశం ఉంది. హామిల్టన్​ వేదికగా నేడు భారత్​,న్యూజిలాండ్​ మధ్య మూడో టీ20 జరగనుంది.

India vs New zealand 3T20I
మూడో టీ20: మాజీ సారథి ధోనీ రికార్డుపై కోహ్లీ గురి

By

Published : Jan 29, 2020, 6:52 AM IST

Updated : Feb 28, 2020, 8:45 AM IST

భారత సారథి విరాట్ కోహ్లీ పొట్టి ఫార్మాట్‌లో మరో రికార్డుపై కన్నేశాడు. ఇంకో 25 పరుగులు సాధిస్తే టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్​గా నిలుస్తాడు. ప్రస్తుతం టీమిండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోనీ (1,112) పేరిట ఈ రికార్డు ఉంది.

టాప్​-4లో కోహ్లీ...

ప్రపంచంలో టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్ల జాబితాలో కివీస్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌ (1,148), దక్షిణాఫ్రికా కెప్టెన్‌ డుప్లెసిస్‌ (1,273) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ధోనీ, కోహ్లీ మూడు, నాలుగు స్థానా​ల్లో ఉన్నారు.

>> మరోసారి హాఫ్ సెంచరీ సాధిస్తే.. టీ20ల్లో అత్యధిక సార్లు 50పై చిలుకు పరుగులు సాధించిన సారథిగా నిలుస్తాడు. ప్రస్తుతం డుప్లెసిస్‌, విలియమ్సన్‌తో కోహ్లీ సమంగా నిలిచాడు.

>> అత్యధిక సిక్సర్లు బాదిన సారథిగా నిలవడానికి కోహ్లీ ఏడు సిక్సర్ల దూరంలో ఉన్నాడు. ప్రస్తుతం ఈ జాబితాలో ఇంగ్లాండ్‌ సారథి ఇయాన్‌ మోర్గాన్‌ ఉన్నాడు. కివీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో కోహ్లీ ఈ ఘనత అందుకునే అవకాశం ఉంది.

ఐదు టీ20ల సిరీస్​లో 2-0 ఆధిక్యంలో ఉంది కోహ్లీసేన. ఈ రోజు మ్యాచ్​ గెలిస్తే సిరీస్‌ కైవసం చేసుకుంటుంది. ఇప్పటివరకు కివీస్​ గడ్డపై భారత్​ పొట్టి ఫార్మాట్​ కప్పు గెలవలేదు.

Last Updated : Feb 28, 2020, 8:45 AM IST

ABOUT THE AUTHOR

...view details