తెలంగాణ

telangana

ETV Bharat / sports

కివీస్ క్లీన్​స్వీప్.. చివరి వన్డేలోనూ ఓడిన భారత్​ - విరాట్ కోహ్లీ

మౌంట్​ మాంగనూయ్ వేదికగా జరిగిన మూడో వన్డేలోనూ భారత్ ఓడిపోయింది. నామమాత్ర మ్యాచ్​లోనూ ఓటమి పాలై, సిరీస్​ను 0-3 తేడాతో కోల్పోయింది.

భారత్-న్యూజిలాండ్
టీమిండియా

By

Published : Feb 11, 2020, 3:08 PM IST

Updated : Feb 29, 2020, 11:55 PM IST

టీమిండియాతో వన్డే సిరీస్​ను న్యూజిలాండ్ క్లీన్​స్వీప్ చేసింది. 3-0 తేడాతో సొంతం చేసుకుంది. ఈరోజు జరిగిన మూడో మ్యాచ్​లోనూ టీమిండియా నిర్దేశించిన 297 పరుగుల లక్ష్యాన్ని 47.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కేఎల్ రాహుల్ సెంచరీ చేసినా, ఫలితం లేకుండా పోయింది.

భారత జట్టు

టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన భారత్.. 7 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. పృథ్వీ షా 40, మాయంక్ అగర్వాల్ 1, కోహ్లీ 9, శ్రేయస్ అయ్యర్ 62, లోకేశ్ రాహుల్ 112, మనీశ్ పాండే 42, జడేజా 8, శార్దుల్ ఠాకుర్ 7, సైనీ 8 పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో బెన్నెట్ 4 వికెట్లు తీయగా, జెమీసన్, నీషమ్ తలో వికెట్ పడగొట్టారు.

సెంచరీ చేసిన కేఎల్ రాహుల్

ఛేదనలో కివీస్ బ్యాట్స్​మన్ మరోసారి అద్భుతంగా రాణించారు. భారత బౌలర్లను సమర్థమంతంగా ఎదుర్కొని స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఓపెనర్లు గప్తిల్ (66), నికోలస్ (80).. తొలి వికెట్​కు 106 పరుగులు చేసి, విజయానికి బలమైన పునాది వేశారు.

మిగతా బ్యాట్స్​మెన్​లో విలియమన్స్ 22, టేలర్ 12, లాథమ్ 32, నీషమ్ 19, గ్రాండ్​హామ్ 58 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని తెచ్చిపెట్టారు. భారత బౌలర్లలో చాహల్ 3 వికెట్లు, శార్దుల్, జడేజా తలో వికెట్ పడగొట్టారు.

న్యూజిలాండ్ జట్టు
Last Updated : Feb 29, 2020, 11:55 PM IST

ABOUT THE AUTHOR

...view details