తెలంగాణ

telangana

ETV Bharat / sports

రెండో టెస్టు: విజయంపై కన్నేసిన భారత్-కివీస్

భారత్-న్యూజిలాండ్​ మధ్య రేపటి(శనివారం) నుంచి రెండో టెస్టు జరగనుంది. తొలి మ్యాచ్​లో గెలిచిన కివీస్.. ఇందులోనూ విజయం సాధించి, కోహ్లీసేనను వైట్​వాష్ చేయాలని భావిస్తోంది.

రెండో టెస్టు: విజయంపై కన్నేసిన భారత్-కివీస్
కోహ్లీ

By

Published : Feb 28, 2020, 10:29 PM IST

Updated : Mar 2, 2020, 9:55 PM IST

కివీస్ పర్యటనలో భాగంగా చివరిదైన రెండో టెస్టుకు అంతా సిద్ధమైంది. క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా రేపు(శనివారం) భారత్- న్యూజిలాండ్‌ తలపడనున్నాయి. తొలి మ్యాచ్​లో చిత్తయిన కోహ్లీసేన.. సిరీస్‌ను సమం చేయాలని భావిస్తోంది. మరోవైపు క్లీన్‌స్వీప్‌ చేయాలనే పట్టుదలతో ఉంది ఆతిథ్య జట్టు. భారత కాలమానం ప్రకారం ఉదయం 4 గంటలకు మ్యాచ్​ ప్రారంభం కానుంది.

ఫామ్‌లేమితో బాధపడుతున్న కోహ్లీ, బుమ్రా.. స్థాయికి తగ్గట్లు రాణిస్తే టీమిండియా గెలుపు కష్టం కాదని నిపుణులు అంటున్నారు. కివీస్‌ జట్టులోకి పేసర్ వాగ్నర్‌ తిరిగి రావడం వల్ల, బౌలింగ్‌ దళం మరింత పటిష్ఠంగా తయారైంది.

టీమిండియా జట్టు

తొలి టెస్టులో ఓడిన కోహ్లీసేనకు.. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఇది తొలి ఓటమే అయినా, పేలవ ప్రదర్శన యాజమాన్యాన్ని కంగారు పెడుతోంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో ఆటగాళ్లు తమ స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్నారు. కనీసం రెండో టెస్టులోనైనా లోపాలను సరిదిద్దుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.

ఈ మ్యాచ్​కు ముందు గాయపడ్డ ఓపెనర్‌ పృథ్వీ షా.. కోలుకున్నట్లు జట్టు యాజమాన్యం తెలిపింది. గాయం కారణంగా ఇషాంత్‌.. మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశాలున్నాయి. బదులుగా సైనీ లేదా ఉమేశ్‌ ఆడొచ్చు. స్పిన్నర్​ అశ్విన్‌ను జట్టు నుంచి తప్పించొచ్చు.

కివీస్ కెప్టెన్ విలియమ్సన్

న్యూజిలాండ్‌ జట్టులో పెద్దగా మార్పుల్లేకపోవచ్చు. మ్యాచ్​కు వేదికైన హెగ్లే ఓవల్‌ మైదానంలో పిచ్‌పై పచ్చిక ఉండి, పూర్తిగా పేసర్లకు సహకరించనుంది. ఈ నేపథ్యంలో టాస్‌, తొలి రోజు ఆట కీలకం కానుంది.

హెగ్లే ఓవల్ మైదానం
Last Updated : Mar 2, 2020, 9:55 PM IST

ABOUT THE AUTHOR

...view details