ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతోన్న డే/నైట్ టెస్టులో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ తన టెస్టు కెరీర్లో 27వ సెంచరీ చేశాడు. పింక్ బంతితో తొలి శతకం చేసిన భారత బ్యాట్స్‌మన్, కెప్టెన్‌గా నిలిచాడు. రెండో రోజు లంచ్ విరామానికి 4 వికెట్లు నష్టానికి 289 పరుగులు చేసింది టీమిండియా. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ(130), రవీంద్ర జడేజా(12) ఉన్నారు.
కోహ్లీ 27వ సెంచరీ.. భారీ ఆధిక్యం దిశగా భారత్ - IND VS BAN
గులాబి బంతితో జరుగుతున్న టెస్టులో భారత బ్యాట్స్‌మెన్ ధాటిగా ఆడుతున్నారు. సారథి కోహ్లీ.. టెస్టుల్లో 27వ సెంచరీ చేశాడు.

కెప్టెన్ కోహ్లీ
రెండో రోజు 174/3తో ప్రాంరంభించిన కోహ్లీ సేన.. దూకుడుగా ఆటను ప్రారంభించింది. ఈ క్రమంలోనే అర్ధ సెంచరీ చేసిన రహానే(51).. స్లిప్‌లో క్యాట్ ఔట్‌గా వెనుదిరిగాడు.
Last Updated : Nov 23, 2019, 3:06 PM IST