ఇండోర్ వేదికగా జరుగుతున్న భారత్-బంగ్లాదేశ్ తొలి టెస్టు మ్యాచ్‌లో రెండోరోజు.. కోహ్లీసేన 493/6 వద్ద ఆట ముగించింది. ఓవర్‌నైట్ స్కోరు వద్దే డిక్లేర్ ప్రకటించింది టీమిండియా. ఫలితంగా.. 343 పరుగుల ఆధిక్యం సంపాదించింది. అనంతరం.. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్.. 16 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు ఇమ్రుల్ కయేస్, ఇస్లాం ఇద్దరూ పెవిలియన్ బాట పట్టారు. ప్రస్తుతం.. మోమినుల్ హక్, మిథున్ క్రీజులో ఉన్నారు.
ఓవర్‌నైట్ స్కోరు వద్దే భారత్ డిక్లేర్ - భారత్-బంగ్లాదేశ్
భారత్.. 493/6 పరుగుల ఓవర్‌నైట్ స్కోరు వద్దే తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. బంగ్లాపై 343 పరుగుల ఆధిక్యం సంపాదించింది. అనంతరం.. బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ రెండు వికెట్లు కోల్పోయింది.
![ఓవర్‌నైట్ స్కోరు వద్దే భారత్ డిక్లేర్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5079854-425-5079854-1573878504953.jpg)
ఓవర్‌నైట్ స్కోరు వద్ద భారత్ డిక్లేర్
భారత్ తరఫున తొలి ఇన్నింగ్స్‌లో మయాంక్.. ద్విశతకంతో(243) ఆకట్టుకున్నాడు. మిగతా వారిలో రహానే, పుజారా అర్ధ శతకాలు చేశారు. బంగ్లా బౌలర్లలో అబు జాయేద్‌కు 4 వికెట్లు దక్కాయి.