రాజ్‌కోట్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో విధ్వంసకర ప్రదర్శన చేసిన రోహిత్... సిక్సర్ల మోత మోగించాడు. కేవలం 43 బంతుల్లో 85 పరుగులు (6ఫోర్లు, 6 సిక్సర్లు) బాదేశాడు. తన ప్రదర్శనపై మ్యాచ్ అనంతరం సహఆటగాడు చాహల్‌తో ఇంటర్వ్యూలో మాట్లాడిన హిట్‌మ్యాన్.. ఓ ఆసక్తికర విషయం వెల్లడించాడు.
"తొలి మూడు బంతులు సిక్సర్లుగా మలిచాక... మిగతా బంతుల్లోనూ సిక్స్‌లు బాదాలనుకున్నా. ఆ ప్రయత్నంలో నాలుగో బంతి మిస్సయ్యింది. ఇక సిక్సర్లు కాకుండా సింగిల్స్ కోసం చూశాను. పిచ్ పరిస్థితి చూశాక ఆఫ్ స్పిన్ పెద్దగా టర్న్ సాధించట్లేదని అర్థమైంది. అందుకే క్రీజులో ఉండే బంతిని గట్టిగా బాదాలని నిర్ణయించుకున్నా".
--రోహిత్‌శర్మ, టీమిండియా తాత్కాలిక కెప్టెన్
ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్, ఆఫ్ స్పిన్నర్ మొసదెక్ హొస్సేన్ వేసిన 10వ ఓవర్లో తొలి మూడు బంతుల్లో మూడు సిక్సర్లు కొట్టాడు రోహిత్. కానీ తర్వాత మూడు బంతుల్లో మూడు పరుగులే వచ్చాయి. ఫలితంగా ఒక్క ఓవరే వేసిన ఇతడు 21 పరుగులు సమర్పించుకున్నాడు.