తెలంగాణ

telangana

ఫ్లడ్‌లైట్ల వెలుతురులో.. గులాబి బంతులతో టీమిండియా సాధన

By

Published : Nov 17, 2019, 6:52 PM IST

ఇండోర్​ మైదానంలో భారత ఆటగాళ్లు గులాబి బంతితో ప్రాక్టీసు మొదలుపెట్టేశారు. శుక్రవారం బంగ్లాదేశ్​తో మ్యాచ్​ ముగిశాక రవిశాస్త్రి పర్యవేక్షణలో ఈ తర్ఫీదు సాగింది. ఆదివారం వరకు ఈ సెషన్​ జరగనుంది. టీమిండియాతో పాటు బంగ్లా ఆటగాళ్లూ అదే మైదానంలో శిక్షణ పొందనున్నారు.

ఫ్లడ్‌లైట్ల వెలుతురులో.. గులాబీ బంతులతో టీమిండియా సాధన

ఇండోర్‌ వేదికగా టీమిండియా సీనియర్‌ క్రికెటర్లు రోహిత్‌ శర్మ, చెతేశ్వర్‌ పుజారా, రవిచంద్రన్‌ అశ్విన్‌ తొలిసారి ఫ్లడ్‌లైట్ల వెలుతురులో గులాబి బంతితో సాధన చేశారు. శుక్రవారం బంగ్లాదేశ్​తో ఆట ముగిశాక హోల్కర్‌ స్టేడియంలో కోచ్‌ రవిశాస్త్రి పర్యవేక్షణలో శిక్షణ సాగింది. ఆదివారం (నవంబర్​ 17)వరకు ఇరు జట్ల ఆటగాళ్లు అదే మైదానంలో ఉండనున్నారు. నవంబర్​ 19న కోల్​కతాలోని ఈడెన్​ గార్డెన్స్​కు భారత్​-బంగ్లా జట్లు పయనమవుతాయి.

ఈడెన్‌ గార్డెన్‌ వేదికగా ఈ నెల 22న భారత్‌-బంగ్లా తొలిసారి డే/నైట్‌ టెస్టు ఆడనున్నాయి. ఆ మ్యాచ్‌కు ముందు ఫ్లడ్‌లైట్ల వెలుతురులో కేవలం రెండు సెషన్ల సాధనకు మాత్రమే వీలవుతోంది. మరింత అనుభవం లేకుంటే సాయంత్రం వేళ, రాత్రి సమయంలో ఆడటం కష్టం. అందుకే గులాబికి అలవాటు పడేందుకు హోల్కర్‌ మైదానంలో రాత్రుళ్లు సాధన చేస్తున్నారు ఇరుజట్ల ఆటగాళ్లు.

స్వింగ్​ పెరిగింది...

ఇటీవల టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ, టాపార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ గులాబి బంతితో సాధన చేశారు. కానీ అది పగటిపూట. అందుకే రవిచంద్రన్‌ అశ్విన్, కుల్దీప్​ యాదవ్‌ బౌలింగ్‌ను రోహిత్‌శర్మ, చెతేశ్వర్‌ పుజారా రాత్రిపూట ఎదుర్కొన్నారు. కోచ్‌ రవిశాస్త్రి బంతి ప్రవర్తనను పరిశీలించారు. కూకాబుర్ర గులాబి బంతులతో దులీప్‌ ట్రోఫీలో ఆడిన అనుభవం కుల్దీప్​కు ఉంది. అతడు బంతిని ఫ్లైట్‌ చేసినప్పుడు సీమ్‌ను అందుకోవడంలో బ్యాట్స్‌మన్‌ ఇబ్బంది పడ్డారు. ఈ నేపథ్యంలో స్పిన్నర్లతో సాధన చేసేందుకు బ్యాట్స్‌మెన్‌ మొగ్గు చూపుతున్నారు. మరోవైపు రిజర్వు బ్యాట్స్‌మన్‌ హనుమ విహారి, శుభ్‌మన్‌ గిల్‌ కూడా ప్రాక్టీస్ చేయడం గమనార్హం.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details