భారత్, బంగ్లాదేశ్ మధ్య తొలి గులాబి బంతి టెస్టు ఓ వేడుకలా జరగనుంది. ఇప్పటికే బంగాల్లోని ఈడెన్ గార్డెన్స్‌కు చేరుకున్న ఇరుజట్లు నెట్స్లోతీవ్రంగాసాధన చేశాయి. బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ పిచ్ పరిస్థితిని సమీక్షించాడు. తాజాగా సుందరంగా తయారైన మైదానం వీడియోను షేర్ చేసింది భారత బోర్డు.
టీమిండియా సారథి విరాట్ కోహ్లీ... ప్రాక్టీస్ సమయంలో పేసర్ షమి బౌలింగ్‌ను ఎదుర్కొన్నాడు. బంగ్లా బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మన్ కూడా నెట్స్‌లో శ్రమిస్తూ కనిపించాడు.
ప్రణాళిక ఇదే...
ఇప్పటికే రంగురంగుల చిత్రాలతో కొత్త సొబగులు అద్దుకున్న ఈడెన్ గార్డెన్స్‌లో ఆట, పాటల నడుమ ఈ పోరు జరగనుంది. మ్యాచ్ విరామంలో గాయనీ గాయకుల ఆటాపాటా, టీమిండియా దిగ్గజాలకు సత్కారాలు ఉంటాయి. రాజకీయ నాయకులు హాజరవుతారు. చారిత్రక డే/నైట్ టెస్టు ప్రణాళిక అంతా ఆసక్తికరంగా ఉంటుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నాడు.
" సచిన్ తెందూల్కర్, సునీల్ గావస్కర్, కపిల్ దేవ్, రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే ప్రతి ఒక్కరూ అక్కడికి వస్తారు. తేనీటి విరామంలో మైదానంలో మాజీ సారథులను ఊరేగిస్తారు. మరో విరామం సహా ఆట ముగిసిన తర్వాత సంగీత విభావరి ఏర్పాటు చేశాం. రెండు జట్లు, మాజీ సారథులు, బంగ్లా ప్రధాని షేక్ హసీనా, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అక్కడికి వస్తారు. రునా లైలా, జీత్ గంగూలీ సంగీత ప్రదర్శనలు ఉంటాయి. నేనెంతో ఆసక్తిగా ఉన్నాను. నాలుగు రోజుల టికెట్లు అప్పుడే అమ్ముడయ్యాయి"