ఈడెన్‌గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో.. తొలిరోజు కోహ్లీసేన ఆధిపత్యం ప్రదర్శించింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లా బ్యాట్స్మన్లు టీమిండియా పేస్ బౌలింగ్‌కు వణికారు. గులాబి బంతితో ఇషాంత్ శర్మ (5/22) చెలరేగడం వల్ల తొలి ఇన్నింగ్స్‌లో... బంగ్లా జట్టు 106 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 3 వికెట్ల నష్టానికి 174 రన్స్ చేసింది.
ఆరంభం నుంచే పేలవంగా...
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాను ఆదిలోనే ఇషాంత్ దెబ్బతీశాడు. ఇమ్రుల్ కేయస్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అనంతరం బంగ్లా సారథి మోమినుల్ హక్, మహ్మద్ మిథున్ ఖాతా తెరవకముందే ఉమేశ్ పెవిలియన్‌కు పంపించాడు. బంగ్లా కీలక బ్యాట్స్‌మెన్ ముష్ఫికర్, మహ్మదుల్లా (6) ఎక్కువ సేపు క్రీజులో నిలవకపోవడం వల్ల బంగ్లా 38 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాలో పడింది.
ఈ సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన లిటన్ దాస్ (24)తో కలిసి షాద్మాన్ కొద్దిసేపు పోరాడాడు. షమి వేసిన బౌన్సర్ లిటన్ తలకు బలంగా తగలడం వల్ల అతడు లంచ్ విరామానికి రిటైర్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. తర్వాత అతడి స్థానంలో కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా మెహదీ హసన్ బరిలోకి దిగాడు. లంచ్ విరామం తర్వాత బంగ్లా బ్యాట్స్‌మెన్ ఎక్కువసేపు నిలవలేకపోయారు. ప్రత్యర్థి జట్టు బ్యాట్స్‌మన్లలో ఓపెనర్ షాద్మాన్ ఇస్లామ్ (29), లిటన్ దాస్ (24), నయీమ్ హసన్ (19) రాణించారు.
ఇషాంత్ ధాటికి బంగ్లా 106 పరుగులకే చాపచుట్టేసింది. ఉమేశ్ యాదవ్ (3/29), షమి (2/36) రాణించారు.
విరాట్, పుజారా అర్ధశతకాలు..
తొలి ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన టీమిండియా.... మంచి ఆరంభమే అందుకున్నా మయాంక్(14), రోహిత్(21) తక్కువకే వెనుదిరిగారు. 43 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన భారత ఇన్నింగ్స్‌ను... ఆ తర్వాత పుజారా, విరాట్ కలిసి చక్కదిద్దారు. ఈ క్రమంలో పుజారా 55 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. మరో ఎండ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ నెమ్మదిగా ఆడుతూ... కెరీర్లో 23వ అర్ధశతకం పూర్తిచేసుకున్నాడు. ఆటముగిసే సమయానికి విరాట్(59*), రహానే(23*) అజేయంగా నిలిచారు. 46 ఓవర్లు ఆడిన టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 174 పరుగుల వద్ద తొలిరోజు ఆటను ముగించింది. ప్రస్తుతం 68 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.
బంగ్లా బౌలర్లలో హొస్సేన్ 2 వికెట్లు, అల్ ఆమిన్ ఒక వికెట్ సాధించారు.