వాంఖడేలో ఊహించని విధంగా చిత్తయిన టీమిండియా నేడు మరో పోరాటానికి సిద్ధమైంది. సిరీస్‌లో నిలవాలంటే కోహ్లీసేన కచ్చితంగా గెలవాల్సి ఉంది. రాజ్‌కోట్‌లో జరగనున్న రెండో వన్డేకు వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు విశ్రాంతి ఇచ్చింది భారత జట్టు యాజమాన్యం. తల అదురు(కంకషన్)తో బాధపడుతుండటం వల్ల ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం పంత్ ముంబయిలో బీసీసీఐ పర్యవేక్షణలో ఉన్నాడు. ఇతడు టీ20 ప్రపంచకప్‌లో కీలకం కానుండటం వల్ల ఇతడిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది.
ఇదీ జరిగింది...!
వాంఖడేలో జరిగిన తొలివన్డేలో 44వ ఓవర్లో ఆసీస్ పేసర్ కమిన్స్ వేసిన బంతి... బ్యాటుకు తగిలి పంత్ హెల్మెట్‌కు బలంగా తాకింది. గాల్లోకి లేచిన బంతిని ఫీల్డర్ అందుకోవడం వల్ల పంత్ నిరాశగా పెవిలియన్ చేరాడు. రెండో ఇన్నింగ్స్‌లో అతడు మైదానంలోకి రాలేదు. పంత్ బదులు కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ చేశాడు. కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా మనీశ్ పాండే ఫీల్డింగ్ చేశాడు. ఈ నేపథ్యంలో పంత్ పూర్తిగా కుదుటపడకపోవడం వల్ల రెండో వన్డేకు విశ్రాంతి ఇచ్చారు. ఈ మ్యాచ్‌కు బ్యాకప్ వికెట్ కీపర్‌గా ఆంధ్ర కుర్రోడు కేఎస్ భరత్‌ను ఎంపిక చేశారు సెలక్టర్లు. అయితే తుది జట్టులోకి అవకాశం రాకపోవచ్చని క్రీడావర్గాలు భావిస్తున్నాయి.
ఆర్డర్ మారిందా..!