ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ మరోసారి రెచ్చిపోయి ఆడారు. సిడ్నీ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలోనూ ధనాధన్ షాట్లతో స్టేడియాన్ని హోరెత్తించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్.. నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 389 పరుగుల భారీ స్కోరు చేసింది. స్టీవ్ స్మిత్ (104) మరోసారి సెంచరీతో చెలరేగగా.. డేవిడ్ వార్నర్ (83), ఆరోన్ ఫించ్ (60), లబుషేన్ (70), మ్యాక్స్‌వెల్(63*) అద్భుత ప్రదర్శన చేశారు. భారత బౌలర్లలో షమి, బుమ్రా, హార్దిక్ పాండ్య తలో వికెట్ పడగొట్టారు.
దంచికొట్టిన ఆస్ట్రేలియా.. టీమ్ఇండియా లక్ష్యం 390 - ఇండియా vs ఆస్ట్రేలియా వన్డే లైవ్ అప్డేట్
తొలి వన్డేలానే రెండో మ్యాచ్‌లోనూ ఆస్ట్రేలియా అదరగొట్టింది. టీమ్ఇండియాకు 390 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. మరి మన బ్యాట్స్‌మెన్ ఏం చేస్తారో చూడాలి?
దంచికొట్టిన ఆస్ట్రేలియా.. టీమ్ఇండియా లక్ష్యం 390
భారత్‌పై స్మిత్ వరుసగా మూడు సెంచరీలు
ఈ సిరీస్‌లో భాగంగా రెండు వన్డేల్లోనూ స్మిత్ 62 బంతుల్లోనే వరుసగా రెండు సెంచరీలు చేశాడు. అంతకంటే ముందు బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లోనూ టీమ్ఇండియాపై శతకం చేశాడు. దీంతో వన్డేల్లో భారత్‌పై వరుసగా మూడు సెంచరీలు చేసిన ఆటగాళ్లలో జహీర్ అబ్బాస్ (1982-83), నసీర్ జమ్షెడ్ (2012-13), క్వింటన్ డికాక్ (2013) సరసన స్మిత్ చేరాడు.
Last Updated : Nov 29, 2020, 1:11 PM IST