భారత్-ఆస్ట్రేలియా మధ్య ఆసక్తికర పోరు సాగుతోంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న ఆఖరి వన్డేలో భారత ఆటగాళ్లు... నలుపు రంగు బ్యాండ్లు ధరించిన మైదానంలోకి దిగారు. ఇందుకు కారణం ఉంది. భారత మాజీ ఆల్‌రౌండర్ రమేశ్ చంద్ర గంగారం బాపూ నడ్‌కర్ణి(86) శుక్రవారం కన్నుమూశారు. ఆయనకు నివాళిగా భారత ఆటగాళ్లు నల్ల బ్యాండ్లు ధరించారు.
రికార్డు మెయిడెన్లు...
1964లో పర్యాటక జట్టు ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో ఈయన వరసగా 21 మెయిడెన్ ఓవర్లు వేసి రికార్డు సృష్టించి, చరిత్రలోకెక్కాడు. తన కెరీర్లో మొత్తంగా 41 టెస్టులాడి, 1414 పరుగులు చేశారు. 88 వికెట్లు పడగొట్టారు. 6/43.. బాపు కెరీర్లో అత్యుత్తమ గణాంకాలు.
జాతీయ ఎంపిక సంఘ సభ్యుడిగా కూడా సేవలు అందించారు బాపు. ముంబయి క్రికెట్ అసోసియేషన్‌కు సంయుక్త కార్యదర్శిగానూ వ్యవహరించారు. ఆయన మరణం క్రికెట్‌కు తీరని లోటని బీసీసీఐ సంతాపం తెలిపింది. బాపు మరణంపై దిగ్గజ సచిన్ తెందుల్కర్ ట్వీట్ చేశాడు. ఆయన 21 మెయిడెన్ ఓవర్ల రికార్డులు చూస్తూనే పెరిగానని రాసుకొచ్చాడు. ఆయన లేని లోటు తీర్చలేనిదని, నడ్కర్ణి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపాడు.
రమేశ్ చంద్ర గంగారం బాపూ నడ్‌కర్ణి