తెలంగాణ

telangana

ETV Bharat / sports

టాస్​ ఓడిన భారత్​- బ్యాటింగ్​​ ఎంచుకున్న ఆసీస్

సిడ్నీ వేదికగా టీమ్​ఇండియా, ఆస్ట్రేలియా జట్లు రెండో వన్డే ఆడేందుకు సిద్ధమయ్యాయి. టాస్​ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్​ ఆరోన్​ ఫించ్​ బ్యాటింగ్​​ ఎంచుకున్నాడు.

India vs Australia: Aaron Finch won the toss and eleceted to bat first
టాస్​ గెలిచి బ్యాటింగ్​​ ఎంచుకున్న ఆస్ట్రేలియా

By

Published : Nov 29, 2020, 8:47 AM IST

మరికొద్దిసేపట్లో టీమ్‌ఇండియా, ఆస్ట్రేలియా జట్లు రెండో వన్డేలో తలపడనున్నాయి. సిడ్నీ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ తొలుత బ్యాటింగ్‌​ ఎంచుకున్నాడు.

సిడ్నీ క్రికెట్‌ మైదానంలో జరిగిన తొలి వన్డేలో ఓటమితో పర్యటనను మొదలెట్టిన భారత్‌.. అదే స్టేడియంలో రెండో వన్డే ఆడేందుకు సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను చేజార్చుకోకూడదంటే ఈ మ్యాచ్‌లో భారత్‌ నెగ్గాల్సిందే. కరోనా విరామం తర్వాత తిరిగి తొలిసారిగా ఆడిన అంతర్జాతీయ మ్యాచ్‌లో బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో పూర్తిగా విఫలమైన జట్టు ఆ ఓటమి నుంచి బయటపడి బలంగా పుంజుకోవాల్సి ఉంది.

గత మ్యాచ్‌లో హార్దిక్‌, ధావన్‌ మినహా మిగతా ఏ బ్యాట్స్‌మెన్‌ కూడా రాణించలేకపోయారు. ఆ మ్యాచ్‌లో భారత్‌ ఓటమి తేడా చూస్తే 66 పరుగులే కావొచ్చు.. కానీ జట్టుగా దాని ప్రదర్శన మాత్రం తీసికట్టుగా ఉంది. టాప్‌ఆర్డర్‌, మిడిలార్డర్‌లో బౌలింగ్‌ చేసే బ్యాట్స్‌మెన్‌, లోయర్‌ఆర్డర్‌లో బ్యాటింగ్‌ చేసే బౌలర్‌ లేకపోవడం జట్టును దెబ్బతీస్తోంది.

జట్లు

భారత్​:శిఖర్‌ ధావన్‌, మయాంక్‌ అగర్వాల్‌, విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, యుజువేంద్ర చాహల్‌, నవదీప్‌ సైనీ‌, మహ్మద్‌ షమి, జస్ప్రీత్‌ బుమ్రా

ఆస్ట్రేలియా: డేవిడ్‌ వార్నర్‌, ఆరోన్‌ ఫించ్‌ (కెప్టెన్‌), స్టీవ్‌స్మిత్‌, గ్లెన్‌మాక్స్‌వెల్‌, మార్నస్‌ లబుషేన్‌, మొయిసెస్ హెన్రిక్స్‌, అలెక్స్‌ క్యారీ, పాట్‌కమిన్స్‌, మిచెల్‌ స్టార్క్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌, ఆడం జంపా.

ABOUT THE AUTHOR

...view details