టీమిండియాతో మూడో వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ సెంచరీతో ఆకట్టుకోగా, యువ బ్యాట్స్‌మన్ లబుషేన్ తన కెరీర్లో తొలి అర్ధ శతకం చేశాడు. భారత బౌలర్లలో షమి 4, జడేజా 2 వికెట్లు తీయగా, కుల్దీప్, సైనీ తలో వికెట్ పడగొట్టారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది ఆసీస్. ఓపెనర్లు వార్నర్ 3, ఫించ్ 19.. తక్కువ పరుగులే చేసి వెనుదిరిగారు. అలాంటి సమయంలో స్మిత్-లబుషేన్ నిలబడ్డారు. మూడో వికెట్‌కు 126 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో 54 పరుగులు చేసిన లబుషేన్.. జడేజా బౌలింగ్‌లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. మిగతా బ్యాట్స్‌మెన్‌లో స్టార్క్ 0, క్యారీ 35, టర్నర్ 4, కమిన్స్ 0, జంపా 1, అగర్ 9 పరుగులు చేశారు.