తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత్​Xఆస్ట్రేలియా: మూడో వన్డేలో ఫించ్​సేన బ్యాటింగ్​​ - Australia tour of India, 2020

భారత్​-ఆస్ట్రేలియా మధ్య మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. బెంగళూరులోని చిన్నస్వామి వేదికగా జరగుతున్న ఆఖరి వన్డేలో కోహ్లీ, ఫించ్​ సేనలు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్​లో టాస్​ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్​​ ఎంచుకుంది.

India vs Australia 3rd ODI
భారత్​Xఆస్ట్రేలియా మూడో వన్డే

By

Published : Jan 19, 2020, 1:05 PM IST

Updated : Jan 19, 2020, 1:39 PM IST

ద్వైపాక్షిక వన్డే సిరీస్​ ట్రోఫీ కోసం కోసం భారత్‌, ఆసీస్‌ జట్ల మధ్య ఆఖరి పోరు మొదలైంది. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్​లో ఇరుజట్లు ఒక్కో మ్యాచ్​ గెలిచి 1-1 తేడాతో సిరీస్​ సమం చేసుకున్నాయి. నేడు నిర్ణయాత్మక మ్యాచ్​లో ఎవరు విజేతగా నిలిస్తే.. వారే ట్రోఫీ కైవసం చేసుకోనున్నారు.

టాస్​ గెలిచి ఆసీస్​ బ్యాటింగ్​​...

ఈ మ్యాచ్​లో ముందుగా టాస్‌ గెలిచిన ఆసీస్‌ సారథి ఫించ్‌... బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఆస్ట్రేలియా ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. రిచర్డ్సన్​ స్థానంలో హేజిలవుడ్​ బరిలోకి దిగుతున్నాడు.

ఆస్ట్రేలియా, భారత జట్ల సారథులు ఫించ్​, కోహ్లీ

భారత్​.. రెండో వన్డే జట్టుతోనే మ్యాచ్​ ఆడనున్నారు. ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది. రోహిత్​, శిఖర్​ ఈ మ్యాచ్​లో ఓపెనర్లుగా బరిలోకి దిగుతున్నారు.

ఇవీ ఇరుజట్లు...

  • భారత్‌: ధావన్‌, రోహిత్‌, రాహుల్‌(కీపర్), కోహ్లీ (కెప్టెన్‌), శ్రేయస్‌, మనీశ్​ పాండే, జడేజా, కుల్దీప్​, షమి, బుమ్రా, సైనీ
  • ఆస్ట్రేలియా: వార్నర్‌, ఫించ్‌ (కెప్టెన్‌), స్టీవ్‌ స్మిత్‌, లబుషేన్‌, టర్నర్​, కేరీ, అగర్‌, కమిన్స్‌, స్టార్క్‌, హేజిల్​వుడ్​​, ఆడం జంపా.

పరుగుల వరదే...

చిన్నస్వామి స్టేడియంలో పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలించనుంది. భారీ స్కోర్లు నమోదు కావొచ్చు. రెండోసారి బౌలింగ్‌ చేసే జట్టు మంచు వల్ల ఇబ్బందిపడే అవకాశముంది. మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదు.

>>భారత్‌, ఆస్ట్రేలియా జట్లు బెంగళూరులో రెండు వన్డేల్లో తలపడ్డాయి. ఈ మ్యాచ్​ల్లో ఇరుజట్లు కలిసి ఒక మ్యాచ్​లో 709 , మరో మ్యాచ్​లో 647 పరుగులు చేశాయి.

>> ఇక్కడ ఆడిన మూడు వన్డేల్లో రోహిత్‌ శర్మ చేసిన 318 పరుగులు చేశాడు. ఇందులో ఓ డబుల్‌ సెంచరీ కూడా ఉంది.

Last Updated : Jan 19, 2020, 1:39 PM IST

ABOUT THE AUTHOR

...view details