టీమ్ఇండియాతో జరుగుతోన్న బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా.. భోజన విరామం తర్వాత ఆచితూచి ఆడింది. టీ బ్రేక్ అయ్యేటప్పటికి ఐదు వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది.
టీ విరామానికి ఆసీస్ స్కోరు 136/5 - ఆసీస్ భారత్ రెండో టెస్టు
తేనేటి విరామం సమయానికి ఆస్ట్రేలియా ఐదు వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. క్రీజులో గ్రీన్, పైన్ ఉన్నారు.
![టీ విరామానికి ఆసీస్ స్కోరు 136/5 labu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10010938-509-10010938-1608956159659.jpg)
లబుషేన్
ఈ సెషన్లో వరుసగా రెండు వికెట్లను కోల్పోయింది ఆసీస్. తొలి సెషన్ నుంచి జాగ్రత్తగా ఆడుతోన్న లబుషేన్(48) రెండో సెషన్లో సిరాజ్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. దీంతో 124 పరుగులు వద్ద ఆసీస్ నాలుగో వికెట్ కోల్పోయింది. హెడ్(38), బుమ్రా బౌలింగ్‌లో 134 పరుగుల వద్ద ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో కామెరూన్ గ్రీన్, టిమ్‌పైన్ ఉన్నారు.