భారత జట్టు బ్యాటింగ్‌లో టీమిండియా ఓపెనర్లు రోహిత్, ధావన్ శుభారంభం అందించారు. 9 పరుగుల వద్ద రోహిత్ ఔట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. స్టార్క్ బౌలింగ్‌లో హిట్‌మ్యాన్ ఇచ్చిన క్యాచ్‌ను జారవిడిచాడు స్టీవ్ స్మిత్. అప్పట్నుంచి నెమ్మదిగా ఆడిన ఓపెనర్లు.. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు రాబట్టారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 81 పరుగులు జోడించారు. అయితే 42 పరుగులు చేసి మంచి జోరుమీదున్న హిట్‌మ్యాన్‌ను తొలి వికెట్ రూపంలో పెవిలియన్ చేర్చాడు ఆసీస్ బౌలర్ జంపా.
రోహిత్ మిస్సయ్యాడు...
టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్‌శర్మ... ఈ మ్యాచ్‌లో 9 వేల పరుగుల రికార్డును అందుకోవడంలో విఫలమయ్యాడు. దూకుడూగానే ఆడిన హిట్‌మ్యాన్... ఆసీస్ బౌలర్ జంపా బంతిని అంచనా వేయడంలో విఫలమై ఎల్బీగా ఔటయ్యాడు. 42 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. ఇంకో 4 పరుగుల చేస్తే 9000 పరుగుల మైలురాయిని అందుకునేవాడు. అంతేకాకుండా అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన మూడో క్రికెటర్‌గా గుర్తింపు పొందాల్సింది.