సిడ్నీలో జరుగుతున్న తొలి వన్డేలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ధనాధన్ బ్యాటింగ్ చేశారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లులో 6 వికెట్ల నష్టానికి 374 పరుగులు చేసింది. కెప్టెన్ ఆరోన్ ఫించ్ (114), వార్నర్ (69) అదిరిపోయే ఓపెనింగ్ ఇచ్చారు. ఆ తర్వాత బరిలో దిగిన స్మిత్(105) సెంచరీతో కదం తొక్కాడు. మ్యాక్స్‌వెల్ ఇన్నింగ్స్ టీ20ను తలపించింది. 19 బంతుల్లో 45 పరుగులు చేసి ఔటయ్యాడు.
ఫించ్, స్మిత్ ధనాధన్.. టీమ్ఇండియా లక్ష్యం 375 - ఇండియా vs ఆస్ట్రేలియా రెండవ వన్డే
తొలి వన్డేలో భారత్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది ఆస్ట్రేలియా. మ్యాచ్ గెలవాలంటే కోహ్లీసేన.. 50 ఓవర్లలో 375 పరుగులు చేయాలి.
![ఫించ్, స్మిత్ ధనాధన్.. టీమ్ఇండియా లక్ష్యం 375 India vs Australia 2020 Live Score: India Target 375](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9681554-thumbnail-3x2-hd.jpg)
ఫించ్ సెంచరీ.. టీమ్ఇండియా లక్ష్యం 375
మిగతా బ్యాట్స్‌మెన్‌లో స్టోయినిస్(0), లబుషేన్(2), క్యారీ(17), కమిన్స్(1) తమ వంతు పరుగులు చేశారు. భారత బౌలర్లలో షమి 3 వికెట్లు తీయగా, బుమ్రా, చాహల్, సైనీ తలో వికెట్ పడగొట్టారు.
Last Updated : Nov 27, 2020, 1:30 PM IST