తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఏకైక టెస్టులో వెస్టిండీస్​దే విజయం - రకీమ్​ కార్న్​వాల్​

వెస్టిండీస్​ భారీకాయుడు, స్పిన్నర్​ రకీమ్​ కార్న్​వాల్​ బౌలింగ్​ ధాటికి.. ఏకైక టెస్టులో 9 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది అఫ్గానిస్థాన్. లఖ్​నవూ వేదికగా కరీబియన్​ జట్టుతో జరిగిన మ్యాచ్​లో మూడో రోజు 120 పరుగులకే ఆలౌటైంది.

india vs afghanistan 2019: Cornwall took a match haul of 10 wickets as the West Indies won with 9 wicketes in lucknow
24 ఏళ్ల తర్వాత: ఏకైక టెస్టులో అఫ్గాన్​పై విండీస్​దే గెలుపు

By

Published : Nov 29, 2019, 2:26 PM IST

లఖ్‌నవూ వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో వెస్టిండీస్‌ ఘన విజయం సాధించింది. 9 వికెట్ల తేడాతో అఫ్గాన్​ జట్టుపై గెలిచింది.
రెండో రోజు ఓవర్​ నైట్​ స్కోరు 109/7తో ఆటను ప్రారంభించిన అఫ్గాన్​.. 7.1 ఓవర్లు ఆడి 11 పరుగులు మాత్రమే చేసింది. చివరి మూడు వికెట్లు సారథి హోల్డర్​కు దక్కాయి​.

ట్రోఫీతో విండీస్​ సారథి జేసన్​ హోల్డర్​

కార్న్​వాల్​ వల్లే...

విండీస్‌ భారీకాయుడు రకీమ్‌ కార్న్‌వాల్‌ తనదైన స్పిన్​ బౌలింగ్​తో అఫ్గాన్‌ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బందిపెట్టాడు. ఈ మ్యాచ్‌లో కార్న్‌వాల్‌ అరుదైన రికార్డు సాధించాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో భారత పిచ్‌లపై 10 వికెట్లు పడగొట్టిన వెస్టిండీస్‌ తొలి స్పిన్నర్‌గా రికార్డు సృష్టించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు తీసిన అతడు రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లతో చెలరేగాడు. మ్యాన్​ ఆఫ్​ ద మ్యాచ్​ అందుకున్నాడు.

కార్న్​వాల్​కు 'మ్యాన్​ ఆఫ్​ ద మ్యాచ్​'

తొలి ఇన్నింగ్స్​లో 187 పరుగులకే అఫ్గాన్​ జట్టు ఆలౌటవగా.. విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 277 పరుగులు చేసింది. కరీబియన్​ బ్యాట్స్​మెన్​ బ్రూక్స్ (111) శతకంతో చెలరేగాడు. క్యాంప్‌బెల్‌ (55), షేన్‌ డోరిచ్‌ (42) రాణించారు. అఫ్గాన్‌ బౌలర్లలో అమిర్‌ హంజా ఐదు వికెట్లు, రషీద్‌ఖాన్‌ మూడు వికెట్లు పడగొట్టారు.

అనంతరం 90 పరుగుల వెనుకంజలో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన అఫ్గాన్‌... 120 పరుగులకు ఆలౌటైంది. అఫ్గాన్‌ ఓపెనర్ జావెద్‌ (62) అర్ధశతకం బాదాడు. ఈ పసికూన జట్టులో నలుగురు సింగిల్​ డిజిట్​కే పరిమితం కాగా.. ముగ్గురు డకౌట్​ అయ్యారు. విండీస్‌ బౌలర్లలో కార్న్‌వాల్‌, ఛేజ్‌, హోల్డర్​ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.

రికార్డులు...

  • 1995 తర్వాత భారత గడ్డపై మ్యాచ్​లు ఆడిన విండీస్​.. తొలిసారి విజయం నమోదు చేసింది. ఇప్పటివరకు 11 మ్యాచ్​ల్లో 8 ఓటములు, ఒక విజయం, 2 డ్రా అయ్యాయి.
  • టెస్టు హోదా పొందిన తర్వాత భారత్​ చేతిలో తొలి మ్యాచ్​ ఓడిపోయింది అఫ్గాన్​. ఆ తర్వాత ఇదే ఏడాది జరిగిన ఐర్లాండ్​, బంగ్లాతో మ్యాచ్​ల్లో విజయం సాధించింది. మరోసారి విండీస్​ చేతిలో ఓటమిపాలైంది. మొత్తం నాలుగు టెస్టుల్లో రెండు విజయాలు, రెండు అపజయాలు ఖాతాలో వేసుకుంది.
  • 7 టెస్టులు తర్వాత విదేశాల్లో తొలి టెస్టు విజయం సాధించింది వెస్టిండీస్​ జట్టు. వరుసగా బంగ్లాదేశ్​, భారత్​, న్యూజిలాండ్​ చేతిలో రెండేసి మ్యాచ్​లు ఓడిపోయింది కరీబియన్​ బృందం.
  • పర్యటక జట్టు ఫీల్డింగ్​ ఎంచుకుని గెలవడం 2002 తర్వాత ఇదే తొలిసారి. గతంలోనూ బంగ్లాపై ఇదే విధంగా గెలిచింది.

ABOUT THE AUTHOR

...view details