తెలంగాణ

telangana

ETV Bharat / sports

సఫారీలపై యువ టీమిండియా వన్డే సిరీస్​ కైవసం - Yashasvi Jaiswal birthday

భారత అండర్​-19 జట్టు మరోసారి సత్తా చాటింది. దక్షిణాఫ్రికాలో జరుగుతోన్న అండర్​-19 వన్డే సిరీస్​ను సొంతం చేసుకుంది. స్టార్​ క్రికెటర్​ యశస్వి జైస్వాల్​ మరోసారి దుమ్మురేపాడు. నేడు 18వ పుట్టినరోజు జరుపుకొంటున్న ఈ క్రికెటర్​... 'మెన్​ ఇన్​ బ్లూ' సిరీస్​ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. మూడు వన్డేల సిరీస్​లో భాగంగా ఈరోజు జరిగిన రెండో మ్యాచ్​లో ఆల్​రౌండర్​ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు​. ఫలితంగా 'మ్యాన్​ ఆఫ్​ ద మ్యాచ్'​నూ అందుకున్నాడు.

India Under-19 won 3 match ODI series 2019 against South Africa Under-19
సఫారీలపై వన్డే సిరీస్​ గెలిచిన యువ టీమిండియా

By

Published : Dec 28, 2019, 8:58 PM IST

దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన అండర్‌-19 వన్డే సిరీస్​ను సొంతం చేసుకుంది యువ టీమిండియా. శనివారం జరిగిన రెండో వన్డేలో భారత్‌ జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బర్త్​డే బాయ్​ యశస్వి జైశ్వాల్‌ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టుకు సునాయస విజయాన్ని అందించాడు.

టీ20 మ్యాచ్​లానే...

అసలే టీ20 ప్రపంచకప్​ ముందు జరుగుతున్న సిరీస్​ కావడం వల్ల టీమిండియా కుర్రాళ్లంతా అదే జోష్​లో ఉన్నారు. అందుకే సఫారీ జట్టుతో జరిగిన తాజా వన్డే సిరీస్​ను పొట్టి ఫార్మాట్​లా ముగించేశారు. తొలుత బ్యాటింగ్​ చేసిన దక్షిణాఫ్రికా జట్టు 29.5 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌట్​ అయింది. భారత బౌలింగ్​ విభాగంలో యశస్వి జైస్వాల్​ 4 వికెట్లు తీశాడు. ఆకాశ్​, అథర్వ, రవి బిష్ణోయ్ చెరో రెండేసి వికెట్లు ఖాతాలో వేసుకున్నారు.​

120 పరుగుల లక్ష్యాన్ని 2 వికెట్లు కోల్పోయి 16.2 ఓవర్లలోనే ఛేదించింది యువ టీమిండియా. బౌలింగ్​లోనే కాకుండా బ్యాటింగ్​లోనూ రాణించిన యశస్వి 89 పరుగులు (56 బంతుల్లో; 14 ఫోర్లు, 3 సిక్సర్లు) సాధించి నాటౌట్​గా నిలిచాడు. భారత బ్యాట్స్​మన్లలో ధ్రువ్​ జురెల్‌ 26 పరుగులు చేయగా, కెప్టెన్​ ప్రియమ్​ గార్గ్‌ డకౌట్​ అయ్యాడు.

18వ పుట్టినరోజున 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అందుకున్నాడు యశస్వి జైస్వాల్​. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-0 తేడాతో సొంతం చేసుకుంది భారత్.

యశస్వి జైస్వాల్

గురువారం జరిగిన తొలి వన్డేలో 9 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది భారత యువజట్టు. నామమాత్రపు మూడో వన్డే సోమవారం జరుగనుంది. వచ్చే ఏడాదికి గానూ ఇటీవల జరిగిన ఐపీఎల్‌ వేలంలో భారీ ధర పలికాడు యశస్వి. రాజస్థాన్​ జట్టు ఇతడిని రూ.2.4 కోట్లకు సొంతం చేసుకుంది.

ABOUT THE AUTHOR

...view details