తెలంగాణ

telangana

ETV Bharat / sports

అండర్​-19 ప్రపంచకప్​లో టీమిండియా​ హ్యాట్రిక్​ - అండర్​-19 ప్రపంచకప్ 2020

అండర్​-19 మ్యాచ్​లో యువ భారత్​ సత్తా చాటుతోంది. శుక్రవారం న్యూజిలాండ్​తో జరిగిన మ్యాచ్​లో గెలిచి.. హ్యాట్రిక్​ విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ మ్యాచ్​లో డీఎల్​ఎస్​ పద్ధతి ద్వారా 44 పరుగుల తేడాతో గెలిచింది 'మెన్​ ఇన్​ బ్లూ'.

India U19 won by 44 runs Against Newzeland
అండర్​-19 ప్రపంచకప్​: యువ టీమిండియా ఖాతాలో 'హ్యాట్రిక్​'

By

Published : Jan 24, 2020, 10:25 PM IST

Updated : Feb 18, 2020, 7:28 AM IST

అండర్‌ 19 ప్రపంచకప్​లో భారత్​ హ్యాట్రిక్​ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. బ్లూమ్‌ఫోంటీన్‌ వేదికగా న్యూజిలాండ్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో... తొలుత బ్యాటింగ్‌ చేసిన యువ భారత్‌ 23 ఓవర్లలో ఒక్క వికెట్‌ కూడా నష్టపోకుండా 115 పరుగులు చేసింది. వర్షం అంతరాయం కలిగించడం వల్ల మ్యాచ్‌ను 23 ఓవర్లకు కుదించారు. ఈ నేపథ్యంలో డక్‌వర్త్‌లూయిస్‌ పద్ధతిలో న్యూజిలాండ్‌ టార్గెట్‌ను 192గా ప్రకటించారు. అయితే లక్ష్య ఛేదనలో 21 ఓవర్లలో 147 రన్స్​కే ఆలౌటైంది న్యూజిలాండ్​ జట్టు.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు.. ఓపెనర్లు యశస్వి జైశ్వాల్‌ (57; 77 బంతుల్లో 4ఫోర్లు, 2సిక్సర్లు), దివ్యాన్ష్‌ సక్సేనా (52; 62 బంతుల్లో 6ఫోర్లు) అర్ధశతకాలతో చెలరేగి మంచి శుభారంభం అందించారు. ఛేదనలో కివీస్​ ఆటగాళ్లలో మారియి(42), ఫెర్గుస్​(31) మాత్రమే ఫర్వాలేదనిపించారు. 7 మంది సింగిల్​ డిజిట్​​ స్కోరుకే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో అంకోలేకర్​ 3 వికెట్లు తీశాడు. పరుగులు కట్టడి చేస్తూ 4 వికెట్లు సాధించిన రవి బిష్ణోయ్​ 'మ్యాన్​ ఆఫ్​ ద మ్యాచ్'​ అవార్డు అందుకున్నాడు.

అండర్​-19 ప్రపంచకప్​లో ఫేవరెట్​గా బరిలోకి దిగిన యువ భారత్​... తొలి మ్యాచ్​లో శ్రీలంకపై 90 పరుగుల తేడాతో, జపాన్​పై 10 వికెట్ల తేడాతో గెలిచింది.

Last Updated : Feb 18, 2020, 7:28 AM IST

ABOUT THE AUTHOR

...view details