తెలంగాణ

telangana

ETV Bharat / sports

అండర్​-19 సెమీస్​​: టాస్​ గెలిచి పాక్​ ​బ్యాటింగ్​

అండర్​- 19 ప్రపంచకప్​లో భాగంగా భారత్​- పాకిస్థాన్​ జట్ల మధ్య సెమీఫైనల్​లో టాస్​ గెలిచిన పాక్​ జట్టు​ బ్యాటింగ్​ ఎంచుకుంది. డిఫెండింగ్​ ఛాంపియన్​గా బరిలోకి దిగిన యువ టీమిండియా ఐదోసారి ట్రోఫీ గెలవాలని భావిస్తోంది.

By

Published : Feb 4, 2020, 1:06 PM IST

Updated : Feb 29, 2020, 3:19 AM IST

India U19 vs Pakistan U19
అండర్​-19 భారత్​Xపాకిస్థాన్

దక్షిణాఫ్రికాలోని పోర్చెస్ట్రూమ్‌ వేదికగా భారత్‌-పాకిస్థాన్‌ కుర్రాళ్ల ప్రపంచకప్​ మొదలైంది. సెమీస్​లో భాగంగా టాస్​ గెలిచిన పాకిస్థాన్​ తొలుత బ్యాటింగ్​ ఎంచుకుంది.

ఐదో టైటిల్​ వేటలో భారత్​...

ప్రస్తుత టోర్నీలో కెప్టెన్​ ప్రియమ్​గార్గ్​ నేతృత్వంలోని టీమిండియా ఫేవరెట్‌గా కనిపిస్తోంది. ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌ల్లో ఒక్కటి కూడా ఓడకుండా దిగ్విజయంగా ముందుకు సాగుతోంది. పాకిస్థాన్‌ అండర్‌ 19 ప్రపంచకప్‌లో భారత్‌ను ఒకేసారి ఓడించింది. అది కూడా 2006లో. అప్పుడు పాక్‌ రెండోసారి ఛాంపియన్‌గా నిలిచింది. అంతకుముందు 2004లో తొలిసారి మెగా కప్పును ముద్దాడింది. మరోవైపు యువ భారత్‌ ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు అత్యధికంగా నాలుగుసార్లు టైటిల్‌ సాధించింది. ఇప్పుడు ఐదోసారి ప్రపంచకప్​పై కన్నేసింది.

బలమైన ప్రత్యర్థి...

ప్రత్యర్థి పాక్‌ కూడా మంచి దూకుడు మీద ఉంది. అన్ని రంగాల్లోనూ పటిష్ఠంగా కనిపిస్తోంది. ఆ జట్టు పేసర్లు అబ్బాస్‌ అఫ్రిది, మహమ్మద్‌ అమీర్‌ఖాన్‌, తాహిర్‌ హుస్సేన్‌ల బౌలింగ్​ ఎదుర్కొని పరుగులు చేయడం భారత బ్యాట్స్‌మన్‌కు సవాలే! మరోవైపు బ్యాటింగ్‌లో ఓపెనర్‌ హురైరా, మరో​ బ్యాట్స్​మన్​ రోహైల్​ నజీర్​ మీద ఆ జట్టు ఆశలు పెట్టుకుంది. అయితే గతేడాది సెప్టెంబర్‌లో జరిగిన ఆసియా కప్‌ ఫైనల్లో పాక్‌ను చిత్తుచేసి విజేతగా నిలిచిన భారత్‌ పూర్తి ఆత్మవిశ్వాసంతో మైదానంలో అడుగుపెట్టనుంది.

భారత జట్టు...

యశస్వి జైస్వాల్, దివ్యాంశ సక్సేనా,తిలక్ వర్మ, ప్రియమ్ గార్గ్ (సారథి), ధృవ్​ జురెల్ (వైస్ కెప్టెన్, కీపర్), సిద్ధేశ్​ వీర్​, అథర్వ అంకోలేకర్, రవి బిష్ణోయ్, సుశాంత్ మిశ్రా, కార్తీక్ త్యాగి, ఆకాశ్ సింగ్.

పాక్​ జట్టు...

హైదర్​ అలీ, మహ్మద్​ హురైరా, రోహైల్​ నాజిర్​(కీపర్​/కెప్టెన్​), ఫహద్​ మునీర్​, ఖాసీం అక్రమ్​, మహ్మద్​ హారిస్​​, ఇర్ఫాన్​ ఖాన్​, అబ్బాస్​ అఫ్రిదీ, తాహిర్​ హుస్సేన్​, ఆమిర్​ అలీ, మహ్మద్​ ఆమిర్​ఖాన్​.

Last Updated : Feb 29, 2020, 3:19 AM IST

ABOUT THE AUTHOR

...view details