మొతేరా వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన చివరి టీ20లో భారత్ విజయం సాధించింది. 36 పరుగుల తేడాతో గెలుపొందిన కోహ్లీ సేన పొట్టి సిరీస్‌ను 3-2 తేడాతో కైవసం చేసుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియా నిర్ణీత ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ప్రత్యర్థి ముందు 224 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇండియా బ్యాట్స్మెన్లలో రోహిత్, విరాట్లు అర్ధసెంచరీలతో రాణించగా.. సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా విధ్వంసం సృష్టించారు.
కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన భువనేశ్వర్ కుమార్(2/15)కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. విరాట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌ను తొలి ఓవర్లోనే భువీ దెబ్బకొట్టాడు. ఫామ్‌లో ఉన్న జేసన్ రాయ్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన మలన్.. బట్లర్‌తో కలిసి రెండో వికెట్‌కు 129 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. వీరిద్దరూ పదికి తగ్గకుండా రన్‌రేట్‌తో పరుగులు సాధించారు. ఈ క్రమంలోనే మలన్, బట్లర్లు హాఫ్ సెంచరీలు చేశారు. ఈ జంటను మళ్లీ భువనేశ్వరే విడగొట్టాడు.