తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఆసీస్​ పర్యటనకు జంబో జట్టు మంచి ఆలోచనే' - india test series latest news

ఆస్ట్రేలియా పర్యటన కోసం టీమ్​ఇండియా నుంచి 26 మందితో కూడిన జట్టును పంపించడం ఉత్తమమని మాజీ సెలక్షన్ కమిటీ ఛైర్మన్​ ఎమ్మెస్కే ప్రసాద్​ తెలిపాడు. ఇటీవలే వెస్టిండీస్​, పాకిస్థాన్​ క్రికెట్ బోర్డ్లు ఇంగ్లాండ్​ పర్యటన కోసం ఈ తరహా పద్దతినే పాటించాయని పేర్కొన్నారు.

India tour of Australia: A jumbo squad of 26 could be good idea, feels former chairman of selectors MSK Prasad
ఆసీస్​ పర్యటనకు జంబో జట్టు మంచి ఆలోచనే

By

Published : Jul 24, 2020, 8:15 PM IST

కరోనాతో విధించిన లాక్​డౌన్​ అనంతరం.. టీమ్​ఇండియా తొలిసారి టెస్టు సిరీస్​ కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఇందులో భాగంగా 14 రోజుల పాటు క్వారంటైన్​ తప్పనిసరి. ఈ క్రమంలోనే భారత్​ నుంచి భారీ బృందాన్ని పంపాలని ఆస్ట్రేలియా బీసీసీఐని కోరే అవకాశం ఉందని మాజీ సెలక్షన్ కమిటీ ఛైర్మన్​ ఎమ్మెస్కే ప్రసాద్​ అభిప్రాయపడ్డాడు. ఇటీవలే వెస్టిండీస్​, పాకిస్థాన్​ క్రికెట్ బోర్డులు ఇంగ్లాండ్​ పర్యటన కోసం ఈ తరహా పద్దతినే పాటించాయని పేర్కొన్నాడు.

ఈ నేపథ్యంలోనే పర్యటన కోసం టీమ్ఇండియా నుంచి కనీసం 26 మందితో కూడిన జట్టును ఆస్ట్రేలియా పంపించడం మంచిదని తెలిపాడు ఎమ్మెస్కే. భారత జట్టుతో పాటు ఇండియా ఏ జట్టును ఒకే చోట ఉంచడం ఉత్తమమని భావించాడు.

"టీమ్​ఇండియాలోకి రావాలనుకుంటున్న యువ క్రికెటర్ల ఆటతీరును పరిశీలించడానికి జట్టు మేనేజ్​మెంటుకు, సీనియర్లకు ఇదొక మంచి అవకాశం. ఇది ఏ ఆటగాడి ప్రదర్శన మెరుగ్గా ఉందో, ఎలా జట్టుకు సాయపడతారో పరిశీలించేందుకు సాయపడుతుంది."

-ఎమ్మెస్కే ప్రసాద్​, మాజీ సెలక్షన్ కమిటీ ఛైర్మన్

ఈ 26 మంది బృందాన్ని రెండు గ్రూపులుగా విభించవచ్చని.. తద్వారా క్వారంటైన్​ సమయంలో ప్రాక్టీస్​ నిర్వహించొచ్చని అభిప్రాయపడ్డాడు ప్రసాద్. "నెట్​ బౌలర్లు కరోనా బారిన పడరని మనం విశ్వసించలేం. కాబట్టి, పెద్ద బృందంతో వెళ్లడం చాలా మంచిది. ఎందుకంటే ఆటగాళ్లు బయో సెక్యూర్​ వాతావరణంలో ఉంటారు కాబట్టి.. వారి భద్రతపై కాస్త భరోసా ఉంటుంది." అని పేర్కొన్నాడు.

ఒకవేళ సెలెక్టర్​గా అవకాశమిచ్చి జట్టులో ఎవరెవరిని ఎంచుకుంటారని అడగ్గా.. టెస్టు, వన్డే, టీ20 స్పెషలిస్టుల కలయికతో ఈ క్రింది ఆటగాళ్లకు ప్రాధాన్యమివ్వనున్నట్లు వెల్లడించాడు.

ఎవరెవరంటే..

ఓపెనర్లు: రోహిత్​ శర్మ, మయాంక్​ అగర్వాల్​, పృథ్వీ షా, కేఎల్​ రాహుల్​

మిడిల్​ ఆర్టర్​: విరాట్​ కోహ్లీ(కెప్టెన్​), అజింక్యా రెహానే, చెతేశ్వర్​ పుజారా, హనుమ విహారి, శుబ్​మన్​ గిల్​, శ్రేయస్ అయ్యర్​,

వికెట్​ కీపర్లుగా రిషబ్​ పంత్​, వృద్దిమాన్​ సాహ

స్పిన్నర్స్​: రవిచంద్రన్​ అశ్విన్​, రవింద్ర జడేజా, షాబాజ్​ నదీమ్​, రాహుల్​ చాహర్​, కుల్​దీప్​ యాదవ్​

ఆల్​ రౌండర్:​ హార్దిక్ పాండ్యా

పేసర్లు: ఇషాంత్​ శర్మ, మహ్మద్​ షమీ, జస్​ప్రిత్​ బుమ్రా, భువనేశ్వర్​ కుమార్​, ఉమేశ్​ యాదవ్​, నవదీప్​ సైనీ, ఖలీల్​ అహ్మద్​, షార్దుల్​ ఠాకుర్​

టెస్టు సిరీస్:​ దీపక్​ చాహర్​, యుజ్వేంద్ర చాహల్​, కృనాల్​ పాండ్య

ABOUT THE AUTHOR

...view details