జూన్ 18.. గుర్తుపెట్టుకోవాల్సిన తేదీ.ఆ రోజే భారత్, న్యూజిలాండ్ మధ్య ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్ మొదలయ్యేది. ఇంగ్లాండ్‌ను చివరిదైన నాలుగో టెస్టులో చిత్తుగా ఓడించిన కోహ్లీ సేన.. రాజసంగా తుది పోరుకు అర్హత సాధించింది. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.
ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ట్వీట్ చేసింది. జూన్ 18 నుంచి 5 రోజుల పాటు ఈ ఫైనల్ టెస్టు జరగనుంది. జూన్ 23ను రిజర్వ్ డే గా ప్రకటించింది.
'' ఇంగ్లాండ్‌పై గెలుపు అనంతరం.. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ లీగ్ దశను భారత్ అగ్రస్థానంతో ముగించింది.''
- ఐసీసీ ట్వీట్