విజయంతో కొత్త ఏడాది ఘనంగా ఆరంభించాలనుకున్న టీమిండియా, శ్రీలంకకు తొలి టీ20లో నిరాశే మిగిలింది. వరుణుడు కరుణించినా నిర్వహణ లోపంతో... ఒక్క బంతి కూడా పడకుండానే తొలి టీ20 రద్దయింది.నేడు ఇండోర్‌లో జరగనున్న రెండో టీ20పై అభిమానుల చూపు మళ్లింది. స్టేడియం మారినా.. తొలి మ్యాచ్ కోసం ప్రకటించిన ఇరుజట్లలో మార్పులు ఉండకపోవచ్చు.
తొలి టీ-20లో... బుమ్రా మెరుపులు చూద్దామనుకున్న అభిమానులు వర్షంతో నిరాశకు గురయ్యారు. ఈ మ్యాచ్‌లో బుమ్రాతో పాటు మరో ఇద్దరు పేసర్లు నవ్‌దీప్ సైనీ, శార్దూల్ ఠాకూర్ తుది జట్టులోకి వచ్చారు. రవీంద్ర జడేజాకు స్థానం లభించలేదు. వాషింగ్టన్ సుందర్, కుల్‌దీప్ యాదవ్ స్పిన్నర్లుగా...తుదిజట్టులో స్థానం దక్కించుకున్నారు.
భారత్-శ్రీలంక జట్ల కెప్టెన్లు అటు శ్రీలంక.. ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లకు తుదిజట్టులో చోటు కల్పించింది. చాలా కాలం తర్వాత టీ20 ఆడాలనుకున్న ఆల్‌రౌండర్ మాథ్యూస్‌కు మ్యాచ్ రద్దుతో నిరాశ తప్పలేదు.
టీ20 ప్రపంచకప్ కోసం జట్టులో స్థానం నిలుపుకోవాలంటే ఓపెనర్ ధావన్.. ఈ సిరీస్‌లో తప్పక రాణించాలి. మరో ఓపెనర్ రాహుల్ విండీస్‌తో సిరీస్‌లో అద్భుతంగా రాణించాడు. మరి ఈ మ్యాచ్‌లో ఈ జోడీ ఎలా రాణిస్తుందో చూడాలి.
భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ-శ్రీలంక కెప్టెన్ లసిత్ మలింగ ఇండోర్ స్టేడియంలో ఇప్పటి వరకు ఒక్క టీ20 మాత్రమే జరిగింది. 2017లో శ్రీలంకతోనే తలపడగా అందులో భారత్.. 88 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.