న్యూజిలాండ్ పర్యటన ముగించుకున్న టీమిండియా.. ఈనెల 12 నుంచి సఫారీలతో వన్డే సిరీస్‌లో తలపడనుంది. తాజాగా భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. గాయం నుంచి కోలుకుని ధావన్, హార్దిక్ పాండ్య, భువనేశ్వర్ రీఎంట్రీ ఇచ్చారు. రోహిత్ శర్మకు ఈ సిరీస్‌కూ విశ్రాంతినిచ్చారు.
భారత్
శిఖర్ ధావన్, పృథ్వీ షా, విరాట్ కోహ్లీ(కెప్టెన్), కేఎల్ రాహుల్, మనీశ్ పాండే, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, చాహల్, జస్ప్రీత్ బుమ్రా, నవదీప్ సైనీ, కుల్దీప్ యాదవ్, శుభ్‌మన్ గిల్
దక్షిణాఫ్రికా 15 మందితో
డికాక్ సారథ్యంలో మొత్తం 15 మందితో కూడిన జట్టును ఇటీవలే ప్రకటించింది దక్షిణాఫ్రికా. కెప్టెన్సీ నుంచి తప్పుకున్న డుప్లెసిస్ జట్టులో స్థానం సంపాదించాడు. ఆస్ట్రేలియా సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్న వాన్ డర్ డసేన్.. భారత పర్యటనలో సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. స్పిన్నర్ షంశీ.. ఈ టూర్‌కు దూరమయ్యాడు. మరో స్పిన్నర్ లిండే.. ఇదే సిరీస్‌తో వన్డే అరంగేట్రం చేయనున్నాడు.
సఫారీ జట్టు
క్వింటన్ డికాక్ (కెప్టెన్), బవుమా, వాన్ డర్ డసేన్, డుప్లెసిస్, కైల్ వెర్రీన్నే, హెన్రిచ్ క్లాసన్, డేవిడ్ మిల్లర్, జాన్ స్మట్స్, ఫెహ్లుక్వాయో, లుంగి ఎంగిడి, లుతో సిపమ్లా, బ్యూరాన్ హెండ్రిక్స్, ఎన్రిచ్ నోర్ట్జే, జియోర్జే లిండే, కేశవ్ మహారాజ్