రాంచీ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మూడో టెస్టు మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోహ్లీ.. బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటికే 2-0తో ఆధిక్యంలో ఉన్న కోహ్లీసేన.. ఇందులోనూ గెలిచి సిరీస్ క్లీన్‌స్వీప్ చేయాలని చూస్తోంది. ఇప్పటికే ఇరుజట్లు తీవ్ర కసరత్తులు చేశాయి. మరి విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.
అనుకున్నట్లుగానే డుప్లెసిస్ స్థానంలో బవుమా టాస్కు వచ్చాడు. అయినా వాళ్లకి అదృష్టం కలిసిరాలేదు. ఈ సిరీస్‌లో మూడోసారి వరుసగా టాస్ గెలిచింది కోహ్లీసేన. ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున షాబాజ్ నదీమ్ అరంగేట్రం చేస్తున్నాడు. ఈ సిరీస్‌లో సఫారీ తరఫున ఎంగిడి తొలి టెస్టు ఆడనున్నాడు.