భారత్, దక్షిణాఫ్రికా తొలి వన్డేకు వరుణుడు ఆటంకం కలిగించాడు. కనీసం టాస్ పడకుండానే మ్యాచ్ రద్దయింది. ధర్మశాలలో ఈరోజు మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకావాల్సి ఉన్నా.. సాయంత్రం 5 గంటల వరకు మ్యాచ్ నిర్వహణకు ప్రయత్నాలు జరిగాయి. కనీసం 20 ఓవర్లయినా ఆట జరుగుతుందని అభిమానులు ఆశించారు. అయితే వర్షం తగ్గినా పిచ్ చిత్తడిగా ఉండటం, వెలుతురు లేమి కారణంగా నిర్వహణ సాధ్యం కాదని అంపైర్లు ప్రకటించారు.
భారత్xదక్షిణాఫ్రికా తొలి వన్డే వర్షార్పణం - వర్షం కారణంగా భారత్Xదక్షిణాఫ్రికా తొలి వన్డే రద్దు
ధర్మశాల వేదికగా ఈరోజు జరగాల్సిన భారత్, దక్షిణాఫ్రికా తొలి వన్డే రద్దయింది. వర్షం కారణంగా మైదానం చిత్తడిగా తయారైంది. ఫలితంగా మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాదని అంపైర్లు ప్రకటించారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఆదివారం లఖ్‌నవూలో జరగనుంది.
![భారత్xదక్షిణాఫ్రికా తొలి వన్డే వర్షార్పణం one day match](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6384191-thumbnail-3x2-rk.jpg)
భారత్Xదక్షిణాఫ్రికా తొలి వన్డేకు వరుణుడు ఆటంకి
కరోనా నేపథ్యంలో మైదానంలోకి అభిమానులు కూడా ఎక్కువగా రాలేదు. దాదాపు అన్ని స్టాండ్లు ఖాళీగా కనిపించాయి. గాయాల నుంచి కోలుకున్నాక ఈ మ్యాచ్‌తోనే రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు భారత క్రికెటర్లు హార్దిక్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, ధావన్.