తెలంగాణ

telangana

ETV Bharat / sports

రెండో టీ20లో రికార్డులే రికార్డులు..! - rohit

లాడర్​హిల్​ వేదికగా విండీస్​తో జరిగిన టీ 20లో టీమిండియా పలు రికార్డులు నమోదు చేసింది. మఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కొత్త రికార్డులు అందుకున్నారు.

భారత్ - విండీస్​

By

Published : Aug 5, 2019, 10:59 AM IST

Updated : Aug 5, 2019, 12:55 PM IST

వెస్టిండీస్​తో జరిగిన రెండో టీ 20లో భారత్ 22 పరుగుల తేడాతో గెలిచింది. వర్షం కారణంగా డక్​వర్త్​ లూయిస్​ ప్రకారం టీమిండియా విజేతగా నిలిచింది. ఫలితంగా ఓ మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో సిరీస్​ కైవసం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్​లో పలు రికార్డులు నమోదయ్యాయి.

  1. వెస్టిండీస్​పై వరుసగా 5 టీ 20ల్లో విజయం సాధించింది భారత్​. గత ఏడాది నవంబర్ నుంచి ఇప్పటివరకు విండీస్​తో జరిగిన ఏ టీ 20లోనూ కోహ్లీసేన ఓడలేదు.
  2. విండీస్​పై వరుస సిరీస్​లు గెలిచిన రికార్డూ టీమిండియా పేరు మీద ఉంది. 2018-19లో 3-0, ఈ సిరీస్​లో 2-0 తేడాతో నెగ్గింది భారత్. విండీస్​తో టీ 20ల్లో ఇలా జరగడం ఇదే తొలిసారి.
  3. టీ 20ల్లో అత్యధిక సిక్సర్లు(107) కొట్టిన ఆటగాడిగా రోహిత్ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్​లో మూడు సిక్సర్లు బాదిన రోహిత్ ఈ ఘనత అందుకున్నాడు. ఇంతకు ముందు ఈ రికార్డు విండీస్ విధ్వంసకారుడు గేల్(105) పేరు మీద ఉంది.
  4. టీ 20ల్లో వెస్టిండీస్​పై అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్​మెన్​ రోహిత్ మరో ఘనత అందుకున్నాడు. 12 టీ 20ల్లో 47.22 సగటుతో 425 పరుగులు చేశాడు.
  5. వెస్టిండీస్ - భారత్​ ఇరు జట్ల మధ్య జరిగిన టీ 20ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు కూడా రోహిత్​(24) పేరిటే నమోదైంది. ఆ తర్వాత 21 సిక్సర్లతో విండీస్ క్రికెటర్ ఎవిన్ లూయిస్ ఉన్నాడు.
  6. టీ 20ల్లో 21 ఇన్నింగ్స్​ల్లో 50కి పైగా పరుగులు చేసిన ఘనత అందుకున్నాడు రోహిత్​. ఇందులో 4 శతకాలు 17 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఇంతకు ముందు ఈ రికార్డు కోహ్లీ(20) పేరిట ఉండేది.
  7. టీ 20ల్లో అత్యధిక బౌండరీలు(సిక్సర్లతో కలిపి) కొట్టిన రికార్డునూ అందుకున్నాడు హిట్ మ్యాన్​. 322 బౌండరీలతో(107 సిక్సర్లు, 115 ఫోర్లు) అగ్రస్థానంలో ఉన్నాడు.
  8. వరుసగా రెండు మ్యాచ్​ల్లో డకౌట్ అయ్యాడు విండీస్ ఆటగాడు లూయిస్. అతడి టీ 20 కెరీర్​లో ఇప్పటికి మూడు సార్లు మాత్రమే పరుగులేమి చేయకుండా వెనుదిరిగాడు. 2016లో అప్ఘానిస్థాన్​తో జరిగిన తన అరంగేట్ర మ్యాచ్​లో డకౌట్​ అయ్యాడు​. టీ 20ల్లో భారత్​పై రెండు సెంచరీలు నమోదు చేసిన ఏకైక బ్యాట్స్​మెన్ లూయిసే కావడం విశేషం.
  9. టీ 20ల్లో అత్యధిక ఫోర్లు కొట్టిన బ్యాట్స్​మన్​గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. 64 ఇన్నింగ్స్​ల్లో 224 ఫోర్లు కొట్టి శ్రీలంక ఆటగాడు తిలకరత్నే దిల్షాన్​ను(223 ఫోర్లు, 79 ఇన్నింగ్స్​) వెనక్కి నెట్టాడు.
  10. టీ 20ల్లో(ఐపీఎల్​తో కలుపుకుని) అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడు విరాట్ కోహ్లీ.. రైనా రికార్డును చెరిపివేశాడు. 254 ఇన్నింగ్స్​ల్లో 8వేల 416 పరుగులు చేశాడు. సురేశ్ రైనా 303 ఇన్నింగ్స్​ల్లో 8వేల 392 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు.
  11. ఆదివారం జరిగిన మ్యాచ్​లో 67 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది రోహిత్ - ధావన్ జోడి. వెస్టిండీస్​పై టీ 20ల్లో అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన ఓపెనింగ్ జోడిగా రికార్డు సృష్టించింది. అంతకుముందు బంగ్లాకు చెందిన తమీమ్ ఇక్బాల్ - లిటన్ దాస్ 61 పరుగులు నమోదు చేశారు.
  12. రిషభ్​పంత్ తను చివరగా ఆడిన నాలుగు టీ 20ల్లో సింగిల్ డిజిట్​కే పెవిలియన్ చేరాడు. ఆస్ట్రేలియాపై 3, 1.. ప్రస్తుతం విండీస్​పై 0, 4 స్కోర్లు నమోదు చేశాడు. టీ 20ల్లో అతడి సగటు 16.92

లాడర్​హిల్​ వేదికగా జరిగిన ఈ టీ 20లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్​ 5 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. అనంతరం విండీస్ 15.3 ఓవర్లో 4 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది. ఇంతలో వర్షం కురవడం వల్ల మ్యాచ్ ఆగిపోయింది. డక్​వర్త్​ లూయిస్ ప్రకారం 22 పరుగులతో టీమిండియా మ్యాచ్​లో గెలిచి 2-0 తేడాతో సిరీస్​ కైవసం చేసుకుంది.

ఇది చదవండి: రెండో టీ-20 టీమిండియా​దే.. సిరీస్​ కైవసం

Last Updated : Aug 5, 2019, 12:55 PM IST

ABOUT THE AUTHOR

...view details