తెలంగాణ

telangana

By

Published : Feb 16, 2020, 4:55 PM IST

Updated : Mar 1, 2020, 1:03 PM IST

ETV Bharat / sports

ఆస్ట్రేలియా పర్యటనలో డే/నైట్ టెస్టు!

ఈ ఏడాదిలో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఆడనుంది టీమిండియా. ఇందులో ఓ డే/నైట్ టెస్టు ఉండనుందట. దీనిపై బీసీసీఐ అధికారి స్పష్టత ఇచ్చారు.

కోహ్లీ
కోహ్లీ

గతేడాది నవంబర్​లో ఈడెన్​ గార్డెన్ వేదికగా బంగ్లాదేశ్​తో చారిత్రిక డే/నైట్ టెస్టు ఆడింది టీమిండియా. ఈ మ్యాచ్​లో కోహ్లీసేన ఘనవిజయం సాధించింది. ఈ పోరు తర్వాత బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ మాట్లాడుతూ భవిష్యత్​లో మరిన్ని పింక్ బాల్ టెస్టులకు భారత జట్టు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఆస్ట్రేలియా సిరీస్​లోనూ డే/నైట్ టెస్టు ఆడే అవకాశం ఉన్నట్లు చెప్పారు. కాగా ఈ విషయంపై ఇప్పటికీ ఓ క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా బీసీసీఐ అధికారి ఒకరు మాట్లాడుతూ ఆస్ట్రేలియాతో పింక్ బాల్ టెస్టు ఆడే వీలుందని చెప్పారు.

2018-19 ఆస్ట్రేలియా పర్యటనలో అనుభవం లేని కారణంగా పింక్ బాల్ టెస్టుకు నో చెప్పింది బీసీసీఐ. కానీ ఇటీవల ఆసీస్​తో వన్డే సిరీస్ ప్రారంభంలో ఈ విషయంపై ఓ స్పష్టత ఇచ్చాడు టీమిండియా సారథి కోహ్లీ. ఆస్ట్రేలియాలో డే/నైట్ టెస్టు ఆడతామని తెలిపాడు.

"ఛాలెంజ్​కు మేం సిద్ధం. గబ్బా, పెర్త్ పిచ్ ఏదైనా ఓకే. ఆస్ట్రేలియా గడ్డపై పింక్ బాల్​ ఆడేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నాం."

-కోహ్లీ, టీమిండియా సారథి

బంగ్లాదేశ్​తో టీమిండియా పింక్ బాల్ టెస్టు అనంతరం ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు స్పందించింది. తమ జట్టుతో కూడా డే/నైట్ టెస్టు ఆడాలని కోరింది.

Last Updated : Mar 1, 2020, 1:03 PM IST

ABOUT THE AUTHOR

...view details